hyderabadupdates.com movies లోకేష్ టార్గెట్ 23 మంది సభ్యులపై నజర్

లోకేష్ టార్గెట్ 23 మంది సభ్యులపై నజర్

టీడీపీ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏం చేస్తున్నారో, ఏం చేయాలని భావిస్తున్నారో తనకు వివరాలతో నివేదికలు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. తాజాగా పార్టీ పరిస్థితులపై స్పందించిన నారా లోకేష్ ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు.

ఈ నెల 1న జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం రైతన్నా మీకోసం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేలును, మంత్రులను పాల్గొనాలని సీఎం స్వయంగా సూచించారు. అయితే మొత్తం 45 మంది వరకు ఎమ్మెల్యేలు పాల్గొనలేదు.

దీనిపై సమీక్షించిన నారా లోకേഷ് ఆ ఎమ్మెల్యేల తీరు పట్ల అసంతృప్తి చాటారు. ఈ 45 మందిలో గత మూడు నెలలుగా ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనని ఎమ్మెల్యేల జాబితా తీసుకున్నారు. వీరి సంఖ్య 23. వీరి నుంచి పూర్తి వివరాలు సేకరించి సమర్పించాలని లోకేష్ ఆదేశించారు.

గత మూడు నెలలుగా పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని లోకేష్ పదేపదే చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయంపై దృష్టి పెట్టినా, కొందరు ఎమ్మెల్యేలలో మార్పులు కనిపించడం లేదని రాష్ట్ర స్థాయి నేతలు లోకేష్‌కు వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన లోకేష్ ఆయా ఎమ్మెల్యేల వివరాలు వెంటనే ఇవ్వాలని స్పష్టంగా చెప్పారు.

ఇదిలా ఉండగా పార్టీ సభ్యత్వం ఉన్నప్పుడే మరణించిన కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము అందించాలని, వారిని పరామర్శించాలని లోకేష్ గతంలో సూచించారు. కానీ 75 నుంచి 80 మంది కార్యకర్తల కుటుంబాలకు ఇంకా పర్యవసానాలు అందకపోవడం, ఫైళ్లు ఎమ్మెల్యే కార్యాలయాల్లోనే పేరుకుపోవడం ఆయనను మరింత కోపానికి గురిచేసింది.

త్వరలోనే నివేదికలు సమర్పించాలని, లేకపోతే చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు.

Related Post