hyderabadupdates.com Gallery లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు

లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు

లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు post thumbnail image

అమ‌రావ‌తి : నారా లోకేష్ యువ గ‌ళం చేప‌ట్టి స‌రిగ్గా మూడేళ్లు పూర్త‌య్యింది. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు 70 ఆటో-రిక్షాల పంపిణీ చేశారు. ఆనాటి ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు. జ‌గ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. ఒక ర‌కంగా తెలుగుదేశం ప‌వ‌ర్ లోకి రావ‌డానికి నారా లోకేష్ చేసిన యువ గ‌ళం కీల‌క పాత్ర పోషించింది. ఆయ‌న‌పై ప‌లు కేసులు బ‌నాయించింది ఆనాటి జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇదే క్ర‌మంలో త‌న తండ్రి చంద్ర‌బాబు నాయుడును స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాం పేరుతో వేధింపుల‌కు గురి చేయ‌డం, ఆ త‌ర్వాత అరెస్ట్ చేసి నిర్బంధించ‌డం కూడా ఎదుర్కొన్నారు నారా లోకేష్. అన్నింటిని త‌ట్టుకుని ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.
ఇవాళ రాష్ట్రంలో ఐటీ, విద్యా శాఖ‌ల‌ను నిర్వ‌హిస్తున్నాడు . స‌మ‌ర్త‌వంతంగా పాల‌నలో భాగం పంచుకుంటూ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నాడు. ప్ర‌త్యేకించి ఐటీ ప‌రంగా , ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటులో త‌న తండ్రి చంద్ర‌బాబుతో పోటీ ప‌డుతున్నాడు. ప‌లుమార్లు విదేశాల‌కు వెళ్లాడు. ఆపై భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేలా ప్ర‌య‌త్నం చేయ‌డంలో స‌ఫలీకృతం అయ్యాడు నారా లోకేష్. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్రమంలో పాల్గొన్నారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడంలో ,తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందేందుకు వీలు కల్పించడంలో రఘురామ రాజు చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ దాదాపు 300–400 కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించడానికి సహాయ పడుతుందని అన్నారు.
The post లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావుMLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు

  ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికుల తో ఫోన్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడారు. ఆందోళన పడకండి… బీఆర్ఎస్ అండగా ఉంటుందని కార్మికులకు ఆయన ధైర్యం చెప్పారు. జోర్డాన్‌లో

Cyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపానుCyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాను

    ఆంధ్రప్రదేశ్‌కి తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తుంది. ఇది రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీనితో ఏపీకి వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28,

Anil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేతAnil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత

Anil Sahani : అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌ లో నేతల జంప్‌ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్‌ సహానీ (Anil Sahani) బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే