దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని ప్రసంగించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్‌ప్రెన్యూయర్ విధానంపై చర్చించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి ఏపీ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చొరవ తీసుకుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి సాధించేలా… ఆదర్శవంతంగా ఉండేలా విధానాన్ని తీర్చిదిద్దామన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధిలో అందర్నీ భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతోనే వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం తెచ్చాం అన్నారు..ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి. ఓ తరం అభివృద్ధి చెందాలని అన్నారు.
నా ఆలోచన ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఉంటాయని స్పష్టం చేశారు .
ప్రపంచ వ్యాప్తంగా ఉండే టెక్నాలజీలను, పరిణామాలను అందిపుచ్చుకునేలా ఆలోచన చేయాలని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. భారత దేశం ఇప్పుడు ఉత్పత్తి రంగం వైపు వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. దాన్ని అందిపుచ్చుకునే దిశగా మేం వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం తెచ్చాం అన్నారు. OF-OE విధానం తేవడమే కాదు…దానికి అవసరమైన గైడెన్స్, ఇన్ఫ్రా కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలకు, ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ ద్వారా పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి గైడెన్స్ ఇస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ఇన్ఫ్రాను సిద్దం చేస్తున్నాం అన్నారు.
The post వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాలసీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాలసీ
Categories: