hyderabadupdates.com movies వరప్రసాద్ గారు అడ్వాన్స్ అవుతున్నారు

వరప్రసాద్ గారు అడ్వాన్స్ అవుతున్నారు

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లు దసరా నుంచి మొదలుపెట్టేస్తున్నారు. పబ్లిసిటీలో తనదైన మార్కు చూపించే రావిపూడి ఈసారి మూడు నెలలకు సరిపడా ప్లాన్ ని సిద్ధం చేసి ఉంచుకున్నాడట. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఎలాంటి మార్కెటింగ్ తో ఆడియన్స్ ని ఎక్కువ ఆకట్టుకోగలం అనే దాని మీద పెద్ద ప్రణాళికే వేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. షూటింగ్ జరుగుతున్న టైంలోనే అవసరమైన ప్రోమోలు ప్రత్యేకంగా షూట్ చేసుకుని వాటిని ఎప్పుడు ఎలా వాడాలో తన టీమ్ తో డిస్కస్ చేస్తున్నారట.

ఈసారి అనిల్ రావిపూడికి పోటీపరంగా భారీ ఛాలెంజులు ఉన్నాయి. ప్రభాస్ ది రాజా సాబ్ పెద్ద ఎత్తున బరిలో దిగుతున్నాడు. అది కూడా అందరి కంటే ముందు. జనవరి 9 విడుదల కాబోతున్న ఈ హారర్ డ్రామా మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ 77 కూడా ఎంటర్ టైన్మెంట్ జానర్ లో రూపొందినవే. విజయ్ జన నాయకుడు డబ్బింగ్ అయినా మరీ తక్కువంచనా వేయడానికి లేదు. సో ఇంత కాంపిటీషన్ లో జనాన్ని తనవైపు లాగాలంటే మెగాస్టార్ బ్రాండ్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో క్వాలిటీ కామెడీ ఉందనే నమ్మకం కలిగించాలి.

అందుకే ముందు జాగ్రత్తగా ఇంత అడ్వాన్స్ గా హడావిడి మొదలుపెడుతున్నారు. రాజా సాబ్ ఇప్పటిదాకా ఆరు నిమిషాల వీడియో కంటెంట్ వదిలింది. సంక్రాంతి సినిమాల్లో ఇంత స్పీడ్ గా వేరేవరిది లేదు. అందుకే అనిల్ రావిపూడికి స్పెషల్ ప్లాన్ అవసరమవుతుంది. భీమ్స్ పాటలు, నయనతార గ్లామర్, వెంకటేష్ ప్రత్యేక పాత్ర, బుల్లిరాజు క్యారెక్టర్ ఇలాంటి ఆకర్షణలు అన్నింటిని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ హైప్ ఎలా పెంచాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. రేపు రాబోయే ప్రోమో అనౌన్స్ మెంట్ తోనే మొదటి ఇంప్రెషన్ బలంగా పడుతుందని అంటున్నారు. చూడాలి మరి అనిల్ మార్కు ఎలా ఉండబోతోందో.

Related Post

నిన్నే పెళ్లాడతా జోడి… మరోసారి?నిన్నే పెళ్లాడతా జోడి… మరోసారి?

అక్కినేని నాగార్జున అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని స్పెషల్ మూవీ నిన్నే పెళ్లాడతా. కృష్ణవంశీ దర్శకత్వంలో 1996లో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కమర్షియల్ సినిమాల రికార్డులు బద్దలు కొట్టడం గురించి మీడియాలో కథలు కథలుగా వచ్చేవి. అప్పటికి అయిదు సంవత్సరాల

రంగంలోకి కేసీఆర్‌.. మ‌రింత ప‌దునెక్క‌నున్న ప్ర‌చారం!రంగంలోకి కేసీఆర్‌.. మ‌రింత ప‌దునెక్క‌నున్న ప్ర‌చారం!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌.. గెలిచేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే రెండు కీల‌క అంశాల‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తున్నారు. వీటిలో ఒక‌టి హైడ్రా,