hyderabadupdates.com movies ‘వరల్డ్ ఫేమస్ లవర్’ దర్శకుడి కొత్త సినిమా

‘వరల్డ్ ఫేమస్ లవర్’ దర్శకుడి కొత్త సినిమా

‘ఓనమాలు’ అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు క్రాంతి మాధవ్. ఇది కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా.. క్రాంతిమాధవ్‌కు మంచి పేరొచ్చింది. దీంతో సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు పిలిచి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా చేసే అవకాశమిచ్చారు. రెండో సినిమాతో దర్శకుడిగా మరి కొన్ని మెట్లు ఎక్కాడు క్రాంతి మాధవ్. అదొక కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్‌గా ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది. 

ఐతే తొలి రెండు చిత్రాలతో దర్శకుడిగా వచ్చిన పేరును తర్వాతి చిత్రాలతో క్రాంతి దెబ్బ తీసుకున్నాడు. సునీల్ హీరోగా ఆయన తీసిన మూడో చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. క్రాంతి నుంచి ఇలాంటి సినిమాను ఎవ్వరూ ఊహించలేదు. అయినా సరే విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తీసే అవకాశం అందుకున్నాడు క్రాంతి. ఈ చిత్రాన్ని కూడా కేఎస్ రామారావే నిర్మించారు. కానీ ఈ చిత్రం ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. 

క్రాంతి మాధవ్ కొన్నేళ్ల పాటు కనిపించకుండా పోయాడు. మధ్యలో ‘డీజీఎల్’ ఒక సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు కానీ.. అది ముందుకు కదల్లేదు. కట్ చేస్తే ఇప్పుడు క్రాంతి మాధవ్ కొత్త సినిమా కబురుతో పలకరించాడు. తన కొత్త సినిమా పేరు.. దిల్ దియా. ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించి.. ఆ తర్వాత ‘కీడా కోలా’ సహా పలు చిత్రాల్లో నటించిన చైతన్యరావు ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాడు. 

ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లాంచ్ చేశాడు. క్రాంతికి సందీప్ క్లోజ్ ఫ్రెండ్. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. తన ఫ్రెండు నుంచి క్రాంతి ఇన్‌స్పైర్ అయినట్లుంది. ఇందులో చైతన్య రావు న్యూడ్ బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను మించి బోల్డ్‌గా ఈ సినిమా తీయడానికి క్రాంతిమాధవ్ రెడీ అయినట్లున్నాడు. పూర్ణ నాయుడు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Post

ఎస్ఎస్ఎంబి 29 – వారణాసి వార్తలో నిజమెంతఎస్ఎస్ఎంబి 29 – వారణాసి వార్తలో నిజమెంత

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి వారణాసి టైటిల్ అనుకున్నట్టుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది. నిజానికి జక్కన్న ఇంకా ఏ పేరుని లాక్ చేయలేదట. ముందు మహారాజ్

గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. గోవా వెళ్లాలంటేనే జనం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా