hyderabadupdates.com movies ‘వారణాసి’ ట్రాక్‌లోనే ఉన్నట్లే..

‘వారణాసి’ ట్రాక్‌లోనే ఉన్నట్లే..

ఇప్పుడు ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ అంటే.. ‘వారణాసి’నే. ఎన్నడూ లేని విధంగా ఒక ఇండియన్ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు కూడా ఎదురు చూడడం ఈ చిత్రానికే జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’తో ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను మెప్పించడం ద్వారా తన కొత్త చిత్రంపై వాళ్లూ అంచనాలు పెట్టుకునేలా చేశాడు రాజమౌళి. రామాయణ గాథ జరిగిన త్రేతాయుగానికి.. భవిష్యత్ కాలమానానికి.. ఇంకా అనేక అంశాలకు ముడిపెడుతూ వెండితెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేలా ఉన్నాడు జక్కన్న.

ఇలాంటి భారీ చిత్రంలో విలన్ పాత్ర చేసే అవకాశం మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను వరించింది. ఈ చిత్రంలో అతను కుంభా అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. గత ఏడాది రిలీజ్ చేసిన తన ఫస్ట్ లుక్ మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. రాజమౌళి ఈ పాత్రను ఆషామాషీగా తీర్చిదిద్ది ఉండడనే భావిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఏడాది సమయం ఉండగానే పృథ్వీరాజ్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తి కావడం విశేషం.

ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజే ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించాడు. తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని వెల్లడించిన పృథ్వీరాజ్.. ఇక తాను చీట్ మీల్ తినడానికి సమయం ఆసన్నమైందంటూ ఈ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసి ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. పృథ్వీరాజ్ ఇచ్చిన అప్‌డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ అందుకునేలా ట్రాక్‌లోనే ఉందనడానికి ఇండికేషన్‌లా భావించవచ్చు.

‘వారణాసి’ భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ చిత్రం. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా టైం పడుతుంది. ఈ పాటికే వీఎఫెక్స్ పని మొదలు కాగా.. వాటిని సమయానికి ఒక కొలిక్కి తేవాలటే, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనీ ప్లాన్ ప్రకారం నడవాలి అంటే.. సినిమా విడుదలకు కనీసం ఆరు నెలల ముందు షూట్ మొత్తం పూర్తి చేసి ఉండాలి. ఆ లక్ష్యం దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నాడు జక్కన్న. ఈ ఏడాది ఆగస్టుకల్లా షూట్ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Related Post

OTT: Silent film Gandhi Talks now streaming on Prime Video, but there’s a catchOTT: Silent film Gandhi Talks now streaming on Prime Video, but there’s a catch

Last month, a silent film named Gandhi Talks was released in theatres. The film doesn’t even feature a single dialogue, but the experimental film didn’t make any impact at the