hyderabadupdates.com movies వార్నింగ్ లతో పని మొదలెట్టిన కొత్త సీపీ సజ్జన్నార్

వార్నింగ్ లతో పని మొదలెట్టిన కొత్త సీపీ సజ్జన్నార్

తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిపోయిన వీసీ సజ్జన్నారి్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తానేం చేయాలనుకుంటున్న విషయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా నేరగాళ్లకు వార్నింగ్ లు ఇచ్చిన సజ్జన్నార్… డ్రంకన్ డ్రైవింగ్ ను మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను ఆయన ఏకంగా టెర్రరిస్టులతో పోల్చారు.

డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా… అందులో తాగి బండి నడిపేవాడితో పాటుగా ఏ పాపం తెలియని వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని సజ్జన్నార్ తెలిపారు. ఈ సందర్భంగా డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను ఆయన సూసైడ్ బాంబర్లతో పోల్చారు. తాగి రోడ్డెక్కిన వాడు తాను చావడంతో పాటుగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని, ఫలితంగా చాలా కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే ఇప్పటిదాకా నగరంలో డ్రంకన్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకున్నారని, ఇకపై తనిఖీలను మరింతగా ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు.

నగరంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందన్న సజ్జన్నార్… డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరానికి పలు మార్గాల నుంచి డ్రగ్స్ రావడం అధికమైందన్నారు. దీనిని అరికడతామన్నారు. ఇక నగరంలో చోరీలు, హత్యలు కూడా పెరిగిపోతున్నాయన్న సీపీ… వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నేరస్తులు ఇకపై నేరాలు చేయాలంటేనే భయం కలిగేలా చేస్తామని సజ్జన్నార్ తెలిపారు.

Related Post

శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ పిల్లల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. ఇటీవలే తనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్

నాగార్జున బాటలో అందరూ ప్రయాణిస్తేనాగార్జున బాటలో అందరూ ప్రయాణిస్తే

ఇకపై నాగార్జున అనుమతి లేకుండా ఆయన ఫోటో, వాయిస్, పేరు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నాగ్ కు రెగ్యులర్ మీడియాతో ఎలాంటి సమస్య లేదు.