hyderabadupdates.com movies వావ్… కాంతార ఖాతాలో 700 కోట్లు

వావ్… కాంతార ఖాతాలో 700 కోట్లు

అంచనాలకు మించి ఆడేసిన కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తాజాగా ఏడు వందల కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్. నెట్ లెక్కల్లో చూసుకుంటే సుమారు అయిదు వందల కోట్ల దాకా తేలుతుంది. ఇప్పటిదాకా ఇంత మొత్తాన్ని సాధించిన పదిహేనవ ఇండియన్ మూవీగా కొత్త రికార్డు నమోదు చేసుకుంది. ఏపీ తెలంగాణలో బాగా నెమ్మదించినప్పటికీ కాంతార చాప్టర్ 1 ఇప్పటికీ కర్ణాటకలో స్ట్రాంగ్ గా ఉంది. మూడో వారం పూర్తి చేసుకోబోతున్నా అక్కడ హౌస్ ఫుల్స్ నమోదవుతూనే ఉన్నాయి. బుక్ మై షోలో ట్రెండింగ్ కి అదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. హిందీలోనూ మంచి గ్రిప్ అందుకున్న కాంతార అక్కడ వంద కోట్లు దాటేసింది.

ఇప్పుడప్పుడే కాంతార ఫైనల్ రన్ కు రాకపోవచ్చు. తెలుగు, తమిళంలో కొత్త సినిమాలు వచ్చాయి కానీ కన్నడలో దీన్ని దాటుకునే స్థాయిలో ఏ రిలీజు జరగలేదు. అందుకే అక్కడ వసూళ్ల సునామి కొనసాగుతోంది. అయితే వెయ్యి కోట్ల కలను నెరవేర్చుకుంటుందని భావించిన అభిమానులు నిరాశ పడక తప్పేలా లేదు. ఎందుకంటే ఇంకో మూడు వందల కోట్లు రావాలంటే కాంతార చాప్టర్ 1 అద్భుతాలు చేయాలి. మళ్ళీ పికప్ కావాలి. కానీ డ్యూడ్, కె ర్యాంప్ లు డీసెంట్ నుంచి పాజిటివ్ మధ్యలో రిపోర్ట్స్ తెచ్చుకోవడంతో మూవీ లవర్స్ వాటి వైపు షిఫ్ట్ అయిపోయారు. ఇది బాగా ప్రభావితం చేసే అంశం.

కాకపోతే కూలీ కన్నా చాలా మెరుగ్గా కాంతార ఆడటం విశేషం, రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి దిగ్గజాలు అందరూ కలిసి నటించినా కాంతార చాప్టర్ 1 సాధించిన వసూళ్లకు దగ్గరగా కూడా వెళ్లలేకపోయారు. అలాంటిది ఒక పల్లెటూరి గ్రామీణ సాంప్రదాయాన్ని గొప్పగా ఆవిష్కరించిన రిషబ్ శెట్టి అంత సులభంగా అందుకోలేని గొప్ప ఫలితం సాధించాడు. ఆదివారంతో కలిపి పండగ హడావిడి మూడు రోజులు ఉంటుంది కాబట్టి కాంతార మళ్ళీ పికప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే హోంబాలే ఫిలిమ్స్ తెలివిగా కొత్త కొత్త ట్రైలర్లు కట్ చేసి ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే పనిలో ఉంది.

Related Post

ఆస్ట్రేలియా-దుబాయ్ టూర్‌.. పెట్టుబ‌డుల లెక్క ఇదీ!ఆస్ట్రేలియా-దుబాయ్ టూర్‌.. పెట్టుబ‌డుల లెక్క ఇదీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్‌లు విదేశాల్లో ప‌ర్య‌టించారు. నారా లోకే ష్ ప‌ర్య‌ట‌న ముగియ‌గా.. చంద్ర‌బాబు మ‌రో రెండు రోజులు కొన‌సాగించ‌నున్నారు. ఇక‌, ఈ ప‌ర్య‌ట‌న‌ల ప్రధాన ల‌క్ష్యం.. పెట్టుబ‌డుల వేటేన‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. గ‌త

త‌మ‌న్‌ను గిల్లుతున్న త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్?త‌మ‌న్‌ను గిల్లుతున్న త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్?

గ‌త కొన్నేళ్ల‌లో సౌత్ ఇండియ‌న్ ఫిలిం మ్యూజిక్‌లో అనిరుధ్‌దే ఆధిప‌త్యం. జైల‌ర్, విక్ర‌మ్ లాంటి సినిమాల‌ను త‌న నేప‌థ్య సంగీతం, పాట‌ల‌తో మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. బీస్ట్, లియో, కూలీ లాంటి ఫ్లాప్ సినిమాల్లోనూ త‌న సంగీతానికి మంచి అప్లాజ్ వ‌చ్చింది.