hyderabadupdates.com movies వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్ గారుకి ఆడియన్స్ సూపర్ హిట్ ముద్ర ఒక్క షోతోనే వేసేశారు. బ్లాక్ బస్టర్ దాకా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

అయిదు, ఆరు వందల రూపాయల టికెట్ రేట్లతో కూడా ఫ్యామిలీస్ థియేటర్లకు రావడం ఆశ్చర్యపరిచింది. మెగా బ్రాండ్, అనిల్ రావిపూడి మార్కెట్, హుక్ స్టెప్ సాంగ్ పెంచేసిన హైప్ ఇవన్నీ పెద్ద ప్లస్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి గుంటూరు దాకా రాత్రి సెలెబ్రేషన్లు ఓ రేంజ్ లో జరిగాయి. యుఎస్ లో 1.2 మిలియన్ డాలర్లతో చిరు పెద్ద బోణీ కొట్టేశారు.

ఇక మూవీ విషయానికి వస్తే అనిల్ రావిపూడి నుంచి ఏమేం ఆశించాలో వాటిని అందిస్తూనే తనకు మాత్రమే సాధ్యమైన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, మ్యానరిజంతో చిరంజీవి వన్ మ్యాన్ షో చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హాస్యంతో పాటు ఎమోషన్ ని బ్యాలన్స్ చేసిన తీరు ఇంటర్వెల్ కే పైసా వసూల్ అనిపించేసింది.

చిరంజీవి, నయనతార లవ్ స్టోరీని మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేసిన తీరు చాలా బాగా వచ్చింది. సెటిల్డ్ ప్లస్ ఓవర్ బోర్డు కామెడీతో రావిపూడి చేసిన మేజిక్ మాములుగా లేదు. చిరు వెంకీ కాంబో ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. భీమ్స్ ఇచ్చిన పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయిపోగా విజువల్ గా ఇంకా బాగున్నాయి.

ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి వింటేజ్ బాస్ ని బయటికి తెస్తానని చేసిన ప్రామిస్ అనిల్ రావిపూడి నిలబెట్టుకున్నాడు. ఇది తన గ్రేట్ వర్క్ అనలేం కానీ బెస్ట్ అయితే అనిపించుకుంది. ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో మన శంకరవరప్రసాద్ గారుకి వస్తున్న స్పందన అనూహ్యంగా ఉంది.

బుక్ మై షోలో సగటున గంటకు 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సోమవారం వర్కింగ్ డే ఇంత అంకెలు నమోదు కావడం శుభ సూచకం. ఏది ఏమైనా భోళా శంకర్ ఫలితం, రెండేళ్ల గ్యాప్ తో ఫ్యాన్స్ ఫీలవుతున్న బాధను చిరంజీవి ఈ సినిమాతో పూర్తిగా తీర్చేశారు.

Related Post

శివ మీద నాగార్జున ప్రత్యేక శ్రద్ధశివ మీద నాగార్జున ప్రత్యేక శ్రద్ధ

తన కెరీర్ ని మలుపు తిప్పి టాలీవుడ్ కు కొత్త గ్రామర్ నేర్పించిన శివ రీ రిలీజ్ విషయంలో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విడుదల తేదీ నవంబర్ 14 అయినప్పటికీ దానికి మూడు నాలుగు రోజుల ముందుగానే మీడియాకు స్పెషల్

భీమ‌వ‌రం డీఎస్పీపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫైర్ .. రీజ‌నేంటి?భీమ‌వ‌రం డీఎస్పీపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫైర్ .. రీజ‌నేంటి?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌ర‌చుగా పోలీసుల వ్య‌వ‌హారంపై ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో ఒక‌సారి ఆయ‌న‌.. పోలీసు శాఖ‌ను తామే తీసుకునే వాళ్ల‌మ‌ని కూడా అన్నారు. రాష్ట్రంలో కొంద‌రు అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును కూడా