hyderabadupdates.com movies వింతలు విడ్డూరాలు నిండిన ‘నాగబంధం’

వింతలు విడ్డూరాలు నిండిన ‘నాగబంధం’

పెదకాపుతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో విరాట్ కర్ణ తర్వాత సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నాడు కానీ తాజాగా విడుదలైన నాగబంధం ట్రైలర్ చూస్తుంటే ఇదేదో ఆషామాషీ కంటెంట్ లా కనిపించడం లేదు. హిమాలయ పర్వతాలు, అనంత పద్మనాభ స్వామి గుడిని పోలి ఉన్న ఆలయం, అఘోరాలు, ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తున్న దుష్టశక్తులు, వర్తమానంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులు ఇలా ఒక సరికొత్త వరల్డ్ బిల్డింగ్ ని నాగబంధంలో చూపించబోతున్న క్లారిటీ అయితే వచ్చింది. ప్రతి షాట్ లో విఎఫెక్స్ ఉన్న ఈ వీడియో ముఖ్యంగా చిన్న పిల్లలను బాగా ఆట్టుకునేలా ఉంది.

కళ్యాణ్ రామ్ డెవిల్ తో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా రెండో ప్రయత్నం ఇది. ఏదో రెగ్యులర్ కథను ఎంచుకోకుండా ఇంత పెద్ద విజువల్ గ్రాండియర్ ని తీసుకోవడం విశేషమే. అందులోనూ ఎలాంటి ఇమేజ్ లేని విరాట్ కర్ణ మీద ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం నిర్మాతల సాహసానికి ప్రతీక. అలాని ఈ తరహా బ్యాక్ డ్రాప్ ఎప్పుడూ చూడలేదని కాదు. కార్తికేయ నుంచి కాంతార దాకా చాలానే వచ్చాయి కానీ నాగబంధంలో టోన్, డెప్త్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్ స్క్రీన్ మీద చూస్తే ఎక్స్ పీరియన్స్ వేరే లెవెల్ అనిపించేలా ఉంది. బిజినెస్ కి ఇదే కీలకం కానుంది.

వేసవి విడుదల ప్లాన్ చేసుకున్న నాగబంధంలో నభ నటేష్, ఐశ్యర్య మీనన్ హీరోయిన్లుగా నటించగా జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్ తదితరులతో భారీ క్యాస్టింగ్ ఉంది. జునైద్ కుమార్ – అభే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ కు తగ్గట్టు వైబ్ లో ఉంది. కాకపోతే ఇలాంటి వరల్డ్ బిల్డింగులు తరచుగా వస్తున్న నేపథ్యంలో కథ పరంగా అభిషేక్ నామా ఎలాంటి ప్రయోగాలు చేశారనేది వేచి చూడాలి. ట్రైలర్ చివరి షాట్ లో విరాట్ కర్ణనే శివుడిగా చూపించడం ఊహించని ట్విస్టు కాగా, అన్నిటికన్నా ఇదే హైలైట్ గా నిలవడం మరో విశేషం. వేసవి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న నాగబంధం ఇంకా డేట్ లాక్ చేసుకోలేదు.

Related Post

I didn’t succeed much as I avoided glamorous and intimate roles, says this actressI didn’t succeed much as I avoided glamorous and intimate roles, says this actress

Dhanya Balakrishna is a noted name among the Telugu audiences with films like Seethamma Vaakitlo Sirimalle Chettu, Raju Gari Gadhi, Nenu Sailaja, and Jaya Janaki Nayaka. While promoting her new

లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!

లండ‌న్ పర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం.. కీల‌క భేటీ నిర్వ‌హించారు. లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న‌ర్ (ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారి)తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంట‌ల‌కుపైగా సాగిన ఈ బేటీలో ప‌లు కీల‌క విష‌యాల‌పై