hyderabadupdates.com movies విజయోత్సాహంలో రేవంత్

విజయోత్సాహంలో రేవంత్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందగా…38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది

వార్డుల వారీగా 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డులు దక్కించుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో,బీజేపీ 261 వార్డుల్లో, ఇతరులు 256 వార్డుల్లో విజయం సాధించారు.

ఈ నేపథ్యంలోనే ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇంతటి అఖండ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమే ఈ విజయమన్నారు.

భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని చెప్పారు. రెండేళ్ల ప్రజాపాలన, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ప్రజా తీర్పు అని తెలిపారు. ఈ గెలపు తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు.

Related Post

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి తప్పు మీదంటే

బాబు మ‌రో రికార్డ్‌: పండ‌గ పూట అంద‌రూ హ్యాపీస్‌..!బాబు మ‌రో రికార్డ్‌: పండ‌గ పూట అంద‌రూ హ్యాపీస్‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో రికార్డు సాధించారు. గ‌త కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆయన పండ‌గ పూట సంతోష ప‌రిచారు. ఇది నిజంగానే రికార్డ‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగ సంఘాలు.. నిప్పులు చెరిగాయి. త‌మ‌కు వెంట‌నే