hyderabadupdates.com movies విజ‌య్‌తో లింక్. . స్పందించిన త్రిష‌

విజ‌య్‌తో లింక్. . స్పందించిన త్రిష‌

త‌మిళ సీనియ‌ర్ న‌టి త్రిష.. ఎన్నో ఏళ్ల ముందే పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మైంది. వ‌రుణ్ మ‌ణియ‌న్ అనే నిర్మాత‌తో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ త‌ర్వాత అనూహ్యంగా ఎంగేజ్మెంట్ ర‌ద్ద‌యింది. ఆ త‌ర్వాత ఇప్ప‌టిదాకా త్రిష పెళ్లి చేసుకోలేదు. వ‌య‌సు 40 దాటినా ఇంకా తీరిక లేకుడా సినిమాల్లో న‌టిస్తోంది.

త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఈ మ‌ధ్య త‌మిళ మీడియాలో కొన్ని రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన టాప్ హీరో విజ‌య్‌తో ఆమె బంధం గురించి సోష‌ల్ మీడియాలో త‌ర‌చుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక రాజ‌కీయ నాయ‌కుడు చేసిన వ్యాఖ్య‌లు తాజాగా త‌మిళ‌నాట దుమారం రేపాయి. ఆ నాయ‌కుడి పేరు న‌య‌నార్ నాగేంద్ర‌న్. ఆయ‌న బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర అధ్య‌క్షుడు. ఇటీవ‌ల విజ‌య్ మీద విమ‌ర్శ‌లు గుప్పించే క్ర‌మంలో ఆయ‌న అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

రాజ‌కీయాల్లో విజ‌య్‌కి అనుభ‌వం లేద‌ని, ఆయ‌న ముందుగా త్రిష ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చి త‌న కుటుంబంతో అనుబంధాన్ని క‌లిగి ఉండాల‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై విజ‌య్ స్పందించ‌లేదు కానీ, త్రిష నుంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆమె అడ్వ‌కేట్ నాగేంద్ర‌న్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ త్రిష త‌ర‌ఫున సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దాన్ని త్రిష షేర్ చేసింది.

రాజ‌కీయాల్లో ఉన్న‌త స్థానంలో ఉన్న వ్య‌క్తి ఇలా మాట్లాడతార‌ని త‌న క్లైంట్ ఊహించ‌లేద‌ని.. త్రిష‌కు రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌ని.. రాజ‌కీయ పార్టీల విష‌యంలో ఆమె ఎప్పుడూ త‌ట‌స్థంగానే ఉంద‌ని అడ్వ‌కేట్ పేర్కొన్నారు. సంబంధం లేని విష‌యాల్లోకి త‌న క్లైంట్‌ను లాగొద్దని.. ఆమె దృష్టంతా సినిమాల మీదే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా.. త‌న వ్యాఖ్య‌ల‌పై నాగేంద్ర‌న్ విచారం వ్య‌క్తం చేశారు. ఎవ‌రినీ బాధ పెట్టే ఉద్దేశం త‌న‌కు లేద‌ని.. పొర‌పాటున ఆ వ్యాఖ్య‌లు చేశాన‌ని అన్నారు.

Related Post

జగన్ వై నాట్ 175 ఐతే… సజ్జల వై నాట్ 200జగన్ వై నాట్ 175 ఐతే… సజ్జల వై నాట్ 200

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రచారం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 175కు175 స్థానాలు ఎందుకు గెలవలేమంటూ జగన్ అతి విశ్వాసంతో ఇచ్చిన స్టేట్మెంట్ డిజాస్టర్ అయింది. 2024

Kantara Chapter 1 Box Office: Nears 600cr Worldwide, Topping USD 10 Million OverseasKantara Chapter 1 Box Office: Nears 600cr Worldwide, Topping USD 10 Million Overseas

Kantara: Chapter 1 collected USD 2.40 million approx in its 2nd weekend overseas, pushing it over the USD 10 million mark. The total gross stands at USD 10.75 million (Rs. 95.50 crore), which,