hyderabadupdates.com movies విజయ్, త్రిష.. చరిత్రంతా తవ్వి తీస్తున్నారు

విజయ్, త్రిష.. చరిత్రంతా తవ్వి తీస్తున్నారు

ఒక సినీ ప్రముఖుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి వల్ల తమ అస్థిత్వం దెబ్బతింటుందని అనిపిస్తే.. ఆ వ్యక్తిని అనేక రకాలుగా రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేయడం మామూలే. తెలుగునాట నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాగే టార్గెట్ అయ్యారు.

వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి మరీ వారిని ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. ఇప్పుడు తమిళనాట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టి జనాల్లోకి దూసుకెళ్తున్నాడు విజయ్. గత ఏఢాది కరూర్ తొక్కిసలాట ఘటనతో కొంత కాలం డిఫెన్స్‌లో ఉండిపోయాడు విజయ్. కానీ ఈ మధ్య దాన్నుంచి బయటికి వచ్చి మళ్లీ పార్టీలో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు చేస్తున్నాడు.

దీంతో అతణ్ని దెబ్బ కొట్టడానికి రాజకీయ ప్రత్యర్థులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్, త్రిషల మధ్య బంధం గురించి చర్చ మొదలైంది. ఒక నాయకుడు.. విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటికి రావాలని వ్యాఖ్యానించడం దుమారం రేపింది.

ఇంతలో ఇప్పుడు విజయ్ భార్య సంగీత.. తన భర్త నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక నటితో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలోనే తాను విడాకులు కోరుతున్నట్లు ఆమె వెల్లడించింది. సంగీత.. ఆ నటి పేరు చెప్పకపోయినా, అందరూ త్రిష వైపే వేళ్లు చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే విజయ్, త్రిష మధ్య బంధాన్ని తెలియజెప్పేలా.. అనేక ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను తవ్వి తీస్తున్నారు. విజయ్, త్రిష పలు సందర్భాల్లో ఒకే చోట సన్నిహితంగా మెలిగినట్లు ఆధారాలు చూపిస్తూ.. డాట్స్ కనెక్ట్ చేసే ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

త్రిష పలు సందర్భాల్లో విజయ్‌‌ను ఉద్దేశించి, ఆయన మీద తన ప్రేమను చాటేలా పరోక్షంగా పెట్టిన పోస్టులు..  అలాగే తాను భాగం కాని విజయ్ సినిమాల గురించి ఎగ్జైట్ అవుతూ చేసిన కామెంట్లు.. ఆయా ఈవెంట్లకు హాజరైనప్పటి ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకా వీళ్లిద్దరి బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసేలా అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. అవి చూస్తే అందరికీ విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఈజీగా అర్థమైపోతోంది.

Related Post

కొత్త పాటల కంపోజిషన్‌పై ఇళయరాజా విమర్శలుకొత్త పాటల కంపోజిషన్‌పై ఇళయరాజా విమర్శలు

భారతీయ సినీ సంగీతంలో ఇళయరాజాది ఒక ప్రత్యేక అధ్యాయం. ముఖ్యంగా దక్షిణాది సినీ సంగీతంపై ఆయన వేసిన ముద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని కోట్ల మందికి ఆయన ఆల్ టైం ఫేవరెట్. వాళ్లకు దశాబ్దాలుగా తన పాటలతో ఆయన అద్భుత

కాలనీలో చిక్కుకున్న అల్లరోడి ఆల్కహాల్కాలనీలో చిక్కుకున్న అల్లరోడి ఆల్కహాల్

క్రైమ్ థ్రిల్లర్ చేస్తే కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో 12ఏ రైల్వేకాలనీలో నటించిన అల్లరి నరేష్ కు పెద్ద డిజాస్టరే మిగిలింది. రెండో వారానికే వాషౌట్ కావడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఆ ఒక్కటి అడక్కు లాగా కామెడీ చూపిస్తే జనాలు