hyderabadupdates.com movies విజయ్ దేవరకొండ సుడి బ్రహ్మాండంగా ఉంది

విజయ్ దేవరకొండ సుడి బ్రహ్మాండంగా ఉంది

మాములుగా టయర్ 2 హీరోలకు రెండు ఫ్లాపులు రాగానే నిర్మాతలు బడ్జెట్ లు తగ్గించేసి రిస్క్ లేని కథలను ఎంచుకుంటారు. దర్శకులు కూడా అలాంటి వాళ్లే దొరుకుతారు. కానీ విజయ్ దేవరకొండ దానికి మినహాయింపుగా నిలుస్తున్నాడు. హ్యాట్రిక్ డిజాస్టర్లు పలకరించినా సరే లైనప్ విషయంలో తగ్గేదేలే తరహాలో ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఆల్రెడీ రణబాలి, రౌడీ జనార్ధన సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది.

నాని హీరోగా హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ మూవీతో ప్రశంసలు, వసూళ్లు రెండూ తెచ్చిన దర్శకుడు శౌర్యువ్ కాంబోలో రౌడీ హీరో కొత్త ప్రకటన ఇచ్చాడు. ఇది కూడా యాక్షన్ డ్రామానే. పీరియాడిక్ సెటప్ ఉంటుందని వినికిడి. ప్రీ లుక్ లో విజయ్ తో పాటు ఇతర టీమ్ సభ్యుల ఇంటెన్స్ లుక్ చూస్తుంటే అంచనాలకు అందని కంటెంట్ ఏదో డిజైన్ చేస్తున్న వైనం కనిపిస్తోంది. తన బెస్ట్ ఇస్తానని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా హామీ కూడా ఇచ్చేశాడు.

ఒకరకంగా చెప్పాలంటే ఇదంతా విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా సుడి అని చెప్పాలి. ఎందుకంటే రణబాలి స్వాతంత్రం బ్యాక్ డ్రాప్ లో మైత్రి మూవీ మేకర్స్ చాలా పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆల్రెడీ దీని తాలూకు వీడియో క్లిప్పులు వైరల్ గా మారాయి. ఇంకోవైపు దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న రౌడీ జనార్ధన అవుట్ అండ్ అవుట్ వయొలెంట్ సెటప్ తో రూపొందుతోంది. వీటి దర్శకులు రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా ఇద్దరూ న్యూ జనరేషన్ డైరెక్టర్లే.

లైగర్, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ వైఫల్యాల సంగతి పక్కనపెడితే విజయ్ దేవరకొండకిది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. వీటిలో రెండు బలంగా వర్కౌట్ అయినా నార్త్ ఇండియాలోనూ మార్కెట్ సంపాదించుకోవచ్చు. ఇటీవలే రష్మిక మందన్నని పెళ్లి చేసుకోవడం ద్వారా కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన రౌడీ హీరో మరి ఈ సందర్భంగా తన ట్రాక్ రికార్డును ఏమైనా మార్చుకుంటాడేమో చూడాలి. ఇక్కడితో అయిపోలేదు. మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి . అవి కూడా పెద్ద స్కేలేనట.

Related Post

ఏపీ పాలిటిక్స్‌లో అక్క‌డ అంద‌రూ హీరోలే ..!ఏపీ పాలిటిక్స్‌లో అక్క‌డ అంద‌రూ హీరోలే ..!

కొన్ని కొన్ని జిల్లాల్లో రాజ‌కీయాలు భిన్నంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు-అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసుకుంటున్న జిల్లాలు కొన్ని ఉండ‌గా.. మ‌రికొన్ని మాత్రం అధికారులే హీరోలుగా చ‌లామ‌ణి అవుతు న్నారు. వారి మాటే వినాల‌న్న ప‌ట్టు కూడా ప‌డుతున్నారు. దీంతో పాల‌న ప‌రంగా ఇబ్బందులు వ‌స్తున్నా

సాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకుసాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ కావాలనే డిమాండ్ పెరిగిపోయింది. అనగనగా ఒక రోజు ప్రమోషన్ల కోసం నవీన్ పోలిశెట్టి అమెరికా వెళ్లినప్పుడు అక్కడి ఆడియన్స్ కొందరు ఈ కోరికను థియేటర్లో నేరుగా వినిపించారు. ఆ