hyderabadupdates.com Gallery విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు

విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు

విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు post thumbnail image

కృష్ణా జిల్లా : రోజు రోజుకు సూసైడ్ ల సంఖ్య పెరుగుతోంది శ్రీ చైత‌న్య కాలేజీల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల సంఖ్య‌. తాజాగా కృష్ణా జిల్లా లోని పెన‌మ‌లూరు పోరంకిలో చ‌దువుకుంటున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ చేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. ఆపై ఇందుకు సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యాయి. త‌న వ‌య‌సు 17 ఏళ్లు. శ్రీ చైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. తోటి విద్యార్థి హేమంత్ తో ప‌వ‌న్ కుమార్ గొడ‌వ‌ప‌డ్డారు. దీనిని మ‌న‌సులో పెట్టుకుని ప‌వ‌న్ కుమార్ ను గ‌దిలోకి పిలిపించారు. గ‌త జ‌న‌వ‌రి నెల 5వ తేదీ రాత్రి 11 గంట‌ల‌కు పిలిపించి దారుణంగా కొట్టారు. దీంతో త‌న‌ను హింసించి, దాడికి పాల్ప‌డిన ప్ర‌తి ఒక్క పేరును త‌న చేతిపై రాసుకున్నాడు ప‌వ‌న్ కుమార్.
త‌న‌పై దాడి చేస్తున్న వీడియోలు వైర‌ల్ కావ‌డంతో త‌ట్టుకోలేక పోయాడు. తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు . ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విష‌యం గ‌మ‌నించిన ప్రిన్సిపాల్ ఆధారాలు బ‌య‌ట‌కు రాకుండా చేశాడు. ఆపై తమ కాలేజీలో ప‌ని చేస్తున్న సిబ్బందిని ప‌వ‌న్ కుమార్ చేతిపై రాసిన వారి పేర్ల‌ను తుడిపి వేయించాడు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం బ‌య‌ట‌కు రాకుండా ఆధారాలు చెరిపి వేశారు. ఆనోటా ఈనోటా తెలియ‌డంతో , మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట పడింది. ప్రిన్సిపాల్ తో పాటు ప్రిన్సిపాల్ తో పాటు ఫ్లోర్ ఇన్ ఛార్జి ర‌వీంద్ర‌, మెస్ నిర్వాహ‌కులు హేమంత్, రాజేష్ , జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్లు ఆనంద్, కృష్ణ తో పాటు దాడికి పాల్ప‌డిన వారిని మొత్తం 12 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు డీఎస్పీ చ‌ల‌సాని శ్రీ‌నివాస్ , సీఐ వెంక‌ట ర‌మ‌ణ‌లు చెప్పారు.
The post విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎంCM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం

CM Chandrababu : రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని, నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దిష్ట సమయంలోగా భవనాల పనులు పూర్తి

CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయంCM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం అనంతరం నితీశ్ కుమార్ మంత్రివర్గం మంగళవారంనాడు తొలిసారి సమావేశమైంది. నితీశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటి ఉద్యోగాలు కల్పించాలని, ‘ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్’గా

ఎంఎస్ ధోనీ అస‌లైన వార‌సుడు సంజూ శాంస‌న్ఎంఎస్ ధోనీ అస‌లైన వార‌సుడు సంజూ శాంస‌న్

ముంబై : రేప‌టి నుంచి మెగా ఐపీఎల్ టోర్నీ 2026 ప్రారంభం కానుంది. ఈ త‌రుణంలో భారీ ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి ఆయా జ‌ట్ల‌పై. ప్ర‌ధానంగా ముగ్గురు కీల‌క‌మైన ఆట‌గాళ్లైన మ‌హేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌పై క‌ళ్లు