hyderabadupdates.com Gallery విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి : స్పీక‌ర్

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి : స్పీక‌ర్

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి : స్పీక‌ర్ post thumbnail image

​అమరావతి : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విద్యార్థులు జాబ్స్ తో పాటు రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బుధ‌వారం ఏపీ శాస‌న స‌భ‌ను సంద‌ర్శించారు స్టూడెంట్స్. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పన ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ పర్యటనలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఈ విజ్ఞాన యాత్రలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1400 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించడం విశేషం. సభలో ప్రజా సమస్యలపై జరిగే చర్చలను, సభా వ్యవహారాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. సభా విరామ సమయంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు ఆయన ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అసెంబ్లీని వీక్షించిన విద్యార్థులకు త్వరలోనే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఉద్యోగం చేస్తే కుటుంబానికే పరిమితం అవుతారని, రాజకీయాలలోకి వస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని వారికి ఉద్బోధించారు. నియోజక వర్గాల వారీగా వచ్చిన విద్యార్థులతో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రత్యేకంగా కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, శాసనసభ్యులు బోడె ప్రసాద్, అమ్మిశెట్టి సురేంద్రబాబు, వెనిగండ్ల రాము, సుందరపు విజయ్ కుమార్, బొమ్మిడి నాయకర్, బండారు శ్రావణి, యార్లగడ్డ వెంకట రావు తదితరులు పాల్గొని విద్యార్థులను ఆత్మీయంగా పలకరించారు. చట్టసభల వాతావరణాన్ని నేరుగా చూడటం తమకు ఎంతో జ్ఞానాన్ని, కొత్త స్ఫూర్తిని ఇచ్చిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
The post విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి : స్పీక‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000

  సముద్ర అంతర్భాగంలోని రహస్యాలను ఛేదించడానికి భారత ఆక్వానాట్స్‌ రమేశ్‌ రాజు, జతీందర్‌పాల్‌ సింగ్‌ సిద్ధమవుతున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ‘మత్స్య–6000’సముద్రయాన వాహనంలో వచ్చే ఏడాది ఆరంభంలో సాగర మథనం చేయబోతున్నారు. 28 టన్నుల బరువైన ఈ వాహనం సముద్రంలో

Anil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేతAnil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత

Anil Sahani : అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌ లో నేతల జంప్‌ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్‌ సహానీ (Anil Sahani) బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే

Chandigarh: చండీగఢ్‌ బిల్లుపై కేంద్రం ఆశక్తికర వ్యాఖ్యలుChandigarh: చండీగఢ్‌ బిల్లుపై కేంద్రం ఆశక్తికర వ్యాఖ్యలు

    కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పంజాబ్‌లోని పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో