hyderabadupdates.com movies విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం, తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు సగం విమానాలు పదే పదే సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. గత ఏడాది జనవరి నుంచి ఆరు ప్రముఖ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 754 విమానాలను పరిశీలించగా, అందులో 377 విమానాల్లో ఒకే రకమైన లోపాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ జాబితాలో ఎయిర్ ఇండియా గ్రూప్, ఇండిగో సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకు చెందిన 166 విమానాలను తనిఖీ చేయగా, ఏకంగా 137 విమానాల్లో లోపాలు బయటపడ్డాయి. అంటే దాదాపు 72 శాతం విమానాల్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో కూడా 148 విమానాలు ఇలాంటి రిపీటెడ్ డిఫెక్ట్స్‌తో నడుస్తున్నాయని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇతర సంస్థలైన స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ విమానాల్లోనూ కొన్ని లోపాలను గుర్తించారు.

డీజీసీఏ ఈ ఏడాది కాలంలో వేల సంఖ్యలో తనిఖీలు నిర్వహించి ఈ గణాంకాలను సేకరించింది. విమానాల్లోని సెన్సార్లు, ఇంజిన్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఒకసారి రిపేర్ చేసినా మళ్లీ తలెత్తడం ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ లోపాలపై నిఘా పెంచుతూనే, విమానయాన రంగంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు టెక్నికల్ పోస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు వివరించింది.

అయితే ఈ రిపోర్టుపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. తాము భద్రత విషయంలో రాజీ పడకుండా విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది. విమానాల్లో బయటపడ్డ లోపాల్లో చాలా వరకు సీట్లు, ట్రే టేబుల్స్, వినోదపు స్క్రీన్‌లకు సంబంధించినవేనని, ఇవి విమాన భద్రతకు ముప్పు కలిగించేవి కావని ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. రాబోయే రెండేళ్లలో విమానాలను ఆధునీకరించే క్రమంలో ఈ చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఎన్ని కారణాలు చెప్పినా, ప్రయాణికులు మాత్రం తమ జర్నీ సేఫ్‌గా సాగుతుందా లేదా అనే ఆందోళనలోనే ఉన్నారు. పదే పదే లోపాలు రావడం అనేది మెయింటెనెన్స్ లోపాన్ని సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related Post

పుట్టా మహేష్ వివాదంపై స్పందించిన బాబుపుట్టా మహేష్ వివాదంపై స్పందించిన బాబు

ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ విధ్వంసకర పాలనతో బెంబేలెత్తిన ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రకాష్ రాజ్ బీఫ్ కామెంట్లపై దుమారంప్రకాష్ రాజ్ బీఫ్ కామెంట్లపై దుమారం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి తరచుగా మోడీ సర్కారు మీద విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాడు ప్రకాష్ రాజ్. ఐతే పాలన,