hyderabadupdates.com movies విమాన ప్రయాణం చేసే అయ్యప్ప స్వాములకు శుభవార్త

విమాన ప్రయాణం చేసే అయ్యప్ప స్వాములకు శుభవార్త

అయ్యప్ప భక్తులు ఇరుముడిని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక వీడియో విడుదల చేశారు. ‘మన దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున భక్తులు మాల ధరించి శబరిమల వెళుతుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత, విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ నిబంధనలో మార్పులు చేసి నేరుగా ఇరుముడి తీసుకువెళ్లే విధానాన్ని అనుమతించాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది.ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం, మరియు ఆత్మగౌరవం కల్పించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం… ‘ అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్రకు వెళుతున్నారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి, 41 రోజుల కఠిన దీక్ష తర్వాత యాత్రకు వెళతారు. కార్తీక మాసం, సంక్రాంతి సమయాల్లో భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కేరళతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. 

స్వామియే శరణం అయ్యప్ప!శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి… pic.twitter.com/QT6JGV45Ng— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) November 28, 2025

Related Post

ఢిల్లీ బ్లాస్ట్: మెయిల్ పంపకుండానే సీక్రెట్ చాటింగ్!ఢిల్లీ బ్లాస్ట్: మెయిల్ పంపకుండానే సీక్రెట్ చాటింగ్!

ఢిల్లీ ఎర్రకోట వద్ద 13 మందిని బలితీసుకున్న కారు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు సంస్థలకు మైండ్ బ్లాంక్ చేసే విషయాలు తెలుస్తున్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టింది సామాన్య అనుమానితులు కాదు, ఏకంగా ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు. పేలుడు జరిపిన ఐ20

లాయర్ అవతారమెత్తిన రాజు గారులాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్) వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదూరం అయినా

ఉగాది రోజు కూటమి కొలువుల కానుకఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని జాబ్