hyderabadupdates.com movies వివాదాలతో వసూళ్లు ఎలా వస్తాయి

వివాదాలతో వసూళ్లు ఎలా వస్తాయి

ఈ మధ్య కంటెంట్ కన్నా ఎక్కువగా కాంట్రావర్సితో వార్తల్లో నిలిచిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ రెండో మూవీ ఇది. ముందు నుంచి యాటిట్యూడ్ పేరుతో వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న ఈ కుర్రాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడిన బూతు పాట ఏకంగా పోలీసు కేసుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.

ఒక టీవీ జర్నలిస్టుతో రేగిన ఆన్ లైన్ గొడవ చాలా దూరమే లాగింది. అయితే ఇదంతా ఓపెనింగ్స్ కు ఉపయోగపడొచ్చేమోనని టీమ్ భావించినా లేదా చంద్రహాసే అనుకున్నా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బరాబర్ ప్రేమిస్తాకు పెద్దగా స్పందన లేదు. జనం ఆసక్తి చూపించని వైనం కనిపించింది.

తన మాటల వల్ల డ్యామేజ్ అయిందేమోనని ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న చంద్రహాస్ అదేదో ముందే గుర్తించి ఉంటే బాగుండేది. బూతులు వాడటమే కాక దాన్ని లైవ్ ఛానల్స్ లో సమర్ధించుకున్న విధానం, వితండవాదం చేసుకున్న వైనం సాధారణ ప్రేక్షకులతో అతన్ని డిస్ కనెక్ట్ అయ్యేలా చేసింది.

ఎంత అతి చేస్తే అంత ఫోకస్ లో ఉంటామని ఎవరైనా చెప్పారో ఏమో కానీ పరిణితి లేని ప్రవర్తన వల్ల ఇక్కడి దాకా తెచ్చుకున్నాడు. వేల కోట్ల సామ్రాజ్యాలు ఉన్న స్టార్ కిడ్స్ సైతం ఎప్పుడూ హద్దులు దాటిన దాఖలాలు లేవు. అలాంటిది అప్ కమింగ్ స్టేజిలో ఉన్న కుర్రాడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది.

అసలే ఫిబ్రవరి డ్రైగా మొదలయ్యింది. ఎనిమిది సినిమాలు రిలీజైతే ఒక్కటి కూడా హౌస్ ఫుల్స్ పడలేని దారుణమైన పరిస్థితి నెలకొంది. పాత డిజాస్టర్ ఆరంజ్ హౌస్ ఫుల్ అవుతుంటే యుఫొరియా, శ్రీ చిదంబరంగారు లాంటి నోటెడ్ మూవీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇక బరాబార్ ప్రేమిస్తా గురించి చెప్పడానికి ఏముంది.

ఏమైనా తన మీద గుడ్డిగా కోట్లు పెడుతున్న నిర్మాతలను దృష్టిలో ఉంచుకుని చంద్రహాస్ తనను తాను మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేనిలాగే ఉంటాను నాలాగే ఉంటాను అంటే ఆడియన్స్ కూడా మేము కూడా ఇలాగే ఉంటాం తిరస్కరిస్తూనే ఉంటాము అంటారు.

Related Post

ఒరేయ్ ఆంజనేయులు… ఐకానిక్ ‘అమృతం’ ఈజ్ బ్యాక్ఒరేయ్ ఆంజనేయులు… ఐకానిక్ ‘అమృతం’ ఈజ్ బ్యాక్

“19 ఏళ్ల కిందట ఏడుపుగౌట్టు సీరియళ్లు తెలుగు టీవీ తెరపై ఆధిపత్యం చలాయిస్తుండగా.. ఒక వ్యక్తి దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన ఓ తెలుగు కామెడీ షో సంప్రదాయ తెరలన్నింటినీ తొలగించేసింది. ఐదుసార్లు మళ్లీ మళ్లీ ప్రసారమైన ఏకైక సీరియల్. 2.7 కోట్ల

PIC: Alia Bhatt welcomes 2026 with Ranbir Kapoor and Raha on a serene beach getawayPIC: Alia Bhatt welcomes 2026 with Ranbir Kapoor and Raha on a serene beach getaway

The actress has often shared glimpses of family gettogethers, including recent photos from their Christmas celebration featuring Ranbir, Raha, her mother Soni Razdan, sister Shaheen Bhatt, and Neetu Kapoor, Riddhima Kapoor