hyderabadupdates.com Gallery విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు

విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు

విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు post thumbnail image

అమరావతి : విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్ర‌శంలు కురిపించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్‌లో ఓ వ్యక్తి దాడి చేసి, దుర్భాషలాడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు… ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి, వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియక పోయినా, కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. అలాగే నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పని చేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
The post విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహంWedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం

    పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. కూతురి పెళ్లి కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కూతురు పెళ్ళి కోసం

కొత్త కాన్సెప్ట్‌ తో ఆనంద్‌ దేవరకొండ!కొత్త కాన్సెప్ట్‌ తో ఆనంద్‌ దేవరకొండ!

థియేటర్స్‌లో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నా, ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ పైన కూడా మంచి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, ఈ డిజిటల్‌ వేదికలపై కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వరుసగా వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా వినూత్న