hyderabadupdates.com movies వీడెందుకు వచ్చాడు?.. బాల‌య్య గ‌ర్జ‌న.. ఏం జ‌రిగింది?

వీడెందుకు వచ్చాడు?.. బాల‌య్య గ‌ర్జ‌న.. ఏం జ‌రిగింది?

టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఎంత సౌమ్యంగా ఉంటారో.. అంతే అస‌హ‌నం కూడా ప్ర‌ద‌ర్శిస్తారు. ముఖ్యంగా అభిమానుల‌ను ఆద‌రించే బాల‌య్య‌.. అదే అభిమానులు గ‌డుసుగా ప్ర‌వ‌ర్తిస్తే.. బ‌హి రంగంగానే వారిపై విరుచుకుప‌డిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇదంతా బాల‌య్య అభిమానులు కామ‌న్‌గానే తీసుకుంటారు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా విశాఖ ప‌ర్య‌ట‌న‌లోనూ చోటు చేసుకుంది. త్వ‌ర‌లోనే అఖండ‌-2 విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో త‌న‌కుఎంతో ప్రీతిపాత్ర‌మైన సింహాచ‌లం అప్ప‌న్న ద‌ర్శ‌నానికి బాల‌య్య వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో విశాఖ విమానాశ్ర‌యానికి వచ్చిన బాల‌య్య‌ను చూసేందుకు అభిమానులు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. అయితే.. వీరిని తొలుత ఆప్యాయంగానే ప‌ల‌క‌రించిన‌ప్ప‌టికీ.. కొంద‌రు అభిమానులు బాల‌య్య‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు. ఇది ఆయ‌న‌కు చిర్రెత్తుకొచ్చింది. ఇంత‌లో ఆయ‌న‌ను గ‌తంలో విమ‌ర్శించిన ఓ వ్య‌క్తి కూడా అక్క‌డే క‌నిపించారు. దీంతో మ‌రింత ఆగ్ర‌హానికి గురైన బాల‌య్య‌.. “వీడెందుకు వ‌చ్చాడు. నాకు క‌నిపించ‌డానికి వీల్లేదు. సాయంత్రం ఫంక్ష‌న్‌లోనూ వీడు రాకూడ‌దు.“ అని బాల‌య్య గ‌ర్జించారు. దీంతో అభిమానులు స‌ద‌రు వ్య‌క్తిని ప‌క్క‌కు తీసుకువెళ్లిపోయారు.

అనంత‌రం.. సింహాచ‌లం చేరుకున్న బాల‌య్య ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీనుతో క‌లిసి సింహాచలం చేరుకున్నారు. అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే హోదాతో పాటు సీనియ‌ర్ న‌టుడు కూడా కావ‌డంతో బాల‌య్య‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆల‌యంలోని `కప్ప స్తంభాన్ని` ఆలింగనం చేసుకున్న బాల‌య్య‌.. అనంతరం, గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న అఖండ‌-2 విజ‌య‌వంతం కావాల‌ని కోరుకున్న‌ట్టు కొద్ది మంది మీడియా మిత్రుల‌కు బాల‌య్య వెల్ల‌డించారు.

Related Post

నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది.. పుట్టి పెరిగింది చెన్నైలోనే. తమిళంలో హీరోగా పలు చిత్రాలు చేసి విజయాలూ అందుకున్న

టికెట్ రేట్ల విషయంలో ఎవరు కరెక్ట్టికెట్ రేట్ల విషయంలో ఎవరు కరెక్ట్

అఖండ 2 విడుదల దగ్గర పడుతున్న టైంలో టికెట్ రేట్ల పెంపు చర్చ మరోసారి తెరమీదకు వస్తోంది. ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నిర్మాతలకు ఎదురవుతున్న ప్రశ్న ఇదే. ఎంత హైక్ తీసుకోబోతున్నారని. భయపడేలా వెయ్యి రూపాయలు ఆపైన పెట్టమని, భరించేలానే

వసూళ్ల వర్షంలో మాహిష్మతి సామ్రాజ్యంవసూళ్ల వర్షంలో మాహిష్మతి సామ్రాజ్యం

బాహుబలి ది ఎపిక్ అంచనాలకు మించి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. గురువారం వేసిన ప్రీమియర్లతో కలిపి మొదటి రోజు సుమారు పది కోట్ల నలభై లక్షల దాకా నెట్ వచ్చిందని ట్రేడ్ సమాచారం. అది కూడా కేవలం ఇండియా వైడ్ నెంబర్లే కావడంతో