hyderabadupdates.com movies వృషకర్మ… జాక్ పాట్ కొట్టిందమ్మా

వృషకర్మ… జాక్ పాట్ కొట్టిందమ్మా

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం తలకిందులు అయ్యేంత సున్నితత్వం ప్రస్తుత ట్రెండ్ లో ఉంది. విశ్వంభరకు ఏం జరిగిందో చూశాం. దెబ్బకు ఏడాదికి పైగా రిపేర్లు చేస్తూనే ఉన్నారు. ఏదైతే చిరంజీవికి శాపంగా ఇబ్బంది పెట్టిందో అదే అంశం నాగచైతన్యకు వరంగా మారినట్టు వృషకర్మ బిజినెస్ చూస్తే అర్థమవుతుంది.

ట్రేడ్ సమాచారం మేరకు వృషకర్మ ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలు కలిపి 45 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసిందట. ఆ మేరకు ఒప్పందాలు అయిపోయాయని వినికిడి. ఇందులో అయిదు కోట్లు రికవరీ అడ్వాన్స్ ఉందని టాక్. ఈ హక్కులను సితార సంస్థ సొంతం చేసుకుందని అంటున్నారు. చైతుకిది బెస్ట్ డీల్ అవుతుంది. ఓవర్సీస్, నార్త్ ఇండియా, శాటిలైట్, ఆడియో కాకుండానే ఇంత మొత్తమంటే నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహించిన వృషకర్మలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ స్థాయిలో వరల్డ్ బిల్డింగ్, రాక్షసుడైన విలన్, గుహల్లో రహస్యాలు, గుప్త నిధులు, ఫాంటసీ ప్రపంచాలు ఇలా బోలెడు వింతలు విశేషాలతో పాటు హారర్ కూడా జోడించారు. ఇలాంటి సినిమాలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అజనీష్ లోకనాథ్ మరోసారి తన పనితనాన్ని బయట పెట్టబోతున్నట్టు టీజర్ శాంపిల్ లోనే అర్థమైపోయింది.

తండేల్ హిట్ తర్వాత ఏడాది బ్రేక్ తీసుకున్న నాగ చైతన్య వృషకర్మ కోసం చాలా కష్టపడ్డాడు. ఫిజికల్ గా రిస్క్ తీసుకున్నాడు. దానికి తగ్గట్టే అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ ఉంది. అసలే ఈ జానర్ కు మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ క్లిక్ అయితే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. వేసవి విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు. క్లాష్ లేకుండా సోలో రిలీజ్ కోసం చూస్తున్నారు. ఓటిటి డీల్ కూడా ఆల్మోస్ట్ అయ్యిందని తెలిసింది.

Related Post

ఎవ‌రా హీరోయిన్… ద‌ర్శ‌కుడికి మినిస్ట‌ర్ల ఫోన్లుఎవ‌రా హీరోయిన్… ద‌ర్శ‌కుడికి మినిస్ట‌ర్ల ఫోన్లు

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్లో చూడాల‌ని ఉంది, ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పాటు సైనికుడు, వ‌రుడు, నిప్పు లాంటి దారుణ‌మైన డిజాస్ట‌ర్లూ ఉన్నాయి. అందులో వ‌రుడు అయితే ప్రేక్ష‌కుల అంచ‌నాలను అందుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోతోనే ఇది