hyderabadupdates.com Gallery వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత

వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత

వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత post thumbnail image

అమరావతి : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంకన్న ఫొటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అపచారానికి పాల్పడ్డారని, ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తక్షణమే హిందువులకు, ప్రజలకు జగన్, వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. కలియుగ దైవం వెంకన్న స్వామి ఫొటోలతో రాజకీయం చేయడం క్షమించరాని నేరమన్నారు. తెలుగు జాతి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఫొటోలతో ఉన్న ప్లకార్డులను మండలిలో ఇష్టారాజ్యంగా పడేసి మహా అపచారానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జగన్ రెడ్డి సూచన మేరకే తమ రాజకీయాల కోసం శాసన మండలిలో వెంకన్న స్వామి ఫొటోలను వైసీపీ సభ్యులు వాడుకున్నారని మండిపడ్డారు. మహిళలన్నా గౌర‌వం లేదని, ప్రజల పట్ల బాధ్యత లేదని వైసీపీ సభ్యులపై మంత్రి సవిత మండిపడ్డారు. చివరికి దైవం పట్ల పాపభీతి కూడా లేదన్నారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి పాపం మూట కట్టుకున్నారని, ఇదే విషయం సీబీఐ వేసిన సిట్ సైతం స్పష్టం చేసిందని తెలిపారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, సభలో చర్చలకు ఆటంకం కలిగించడానికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ సభ్యులు రచ్చ చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలతో పాటు తిరుపతి లడ్డూ అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా వైసీపీ సభ్యులు పట్టించుకోవడం లేదన్నారు.
The post వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్షMinister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

    మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదలJammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల

    జమ్మూకశ్మీర్‌ లో 370వ అధికరణ రద్దు తర్వాత రాజ్యసభకు తొలిసారి శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా… ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకుని

YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గురువారం పర్యటించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ సందర్శన కోసం రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్‌ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా