మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. మన శంకరవరప్రసాద్ గారులో స్పెషల్ క్యామియో చేయడం కోసం దానికి ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి రావడంతో అభిమానులు ఎదురు చూపులు ఇంకాస్త పెరిగాయి. దీనికి ‘బంధుమిత్రుల అభినందనలతో’ టైటిల్ దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. రెండో ఆప్షన్ ‘వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం’ని రిజర్వ్ లో ఉంచారు. వెంకటేష్ ఫ్రీ అయ్యాక మాట్లాడుకుని ఒకటి ఫైనల్ చేస్తారు. ఫోటో షూట్ అయ్యాక ఫస్ట్ లుక్ కూడా వచ్చేస్తుంది.
ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేయాలనేది త్రివిక్రమ్ టార్గెట్. ఎందుకంటే నెక్స్ట్ కమిట్ మెంట్స్ చాలా టైట్ గా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అటు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేసుకుని వచ్చేలోపు తనకోసం రాసిన ఫాంటసీ స్క్రిప్ట్ సిధ్దంగా ఉంచాలి. ఇటు వెంకటేష్ కూడా దృశ్యం 3 గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకే అనుకుంటే వేసవిలోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో వెంకీ త్రివిక్రమ్ చేతిలో ఎక్కుడ టైం లేదు. హారికా హాసిని నిర్మాణంలో రూపొందబోయే ఈ ఎంటర్ టైనర్ కి సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ దాదాపు ఫిక్స్ అయినట్టే. అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ అన్నీ వచ్చే నెల ఇస్తారు.
సో పేరు మీద వెంకటేష్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. మంచి వినోదాత్మక చిత్రం అది కూడా నువ్వు నాకు నచ్చావ్ రేంజ్ లో ఉంటుందని అంచనాలు పెట్టేసుకున్నారు. గుంటూరు కారం తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టే కసిమీద ఉన్నారు. అల వైకుంఠపురములో మేజిక్ మళ్ళీ రిపీట్ చేస్తారనే నమ్మకం యూనిట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించే ఈ సినిమాలో కమర్షియల్ హంగులు, మసాలాలు, ఐటెం సాంగ్స్ లాంటివి ఏవి ఉండవట. అవుట్ అండ్ అవుట్ ఫన్ అంటే ఫ్యామిలీస్ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం.