hyderabadupdates.com Gallery వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!

వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!

టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచితమైన విక్టరీ వెంకటేష్ ఇటీవలే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా హిట్ తర్వాత వెంకీ మామ ఇప్పుడు మళ్లీ చాలా కాలం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ వస్తుందనే వార్త ఒక్కటే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది.

ఇక ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా వినిపిస్తున్న సమాచారం మరింత హైప్‌ని పెంచేస్తోంది. త్రివిక్రమ్ ఈసారి తనకు ఎప్పటిలా దేవిశ్రీ ప్రసాద్ లేదా థమన్‌ని కాకుండా, కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేయబోతున్నారట. ఈ అవకాశాన్ని పొందింది యువ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అని సమాచారం.

అర్జున్ రెడ్డి, అనిమల్ వంటి సినిమాలతో తన ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన హర్షవర్ధన్ రామేశ్వర్, ఇప్పుడు త్రివిక్రమ్-వెంకటేష్ ల కాంబినేషన్ కోసం ఎలా సౌండ్ అందిస్తాడన్నదే ఇప్పుడు అందరి కుతూహలం. త్రివిక్రమ్ స్టైల్‌కి తగ్గట్లుగా, వెంకీ మామ ఇమేజ్‌కి తగ్గ మ్యూజిక్ అందించగలడా అనే విషయంపై ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
The post వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Supreme Court: వాట్సప్‌ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టుSupreme Court: వాట్సప్‌ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టు

Supreme Court : వాట్సప్‌కు పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ పేరు ఇటీవల నెట్టింట మార్మోగుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ (Supreme Court) దీని ప్రస్తావన వచ్చింది. వాట్సప్‌ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ

Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలుAzam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు

    డబుల్‌ పాన్‌ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్‌ నేత ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ 1993 జనవరి 1వ

ఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫాఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫా

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ రాష్ట్రంలోని ఇమామ్ లు, మౌజ‌న్ల‌కు తీపి క‌బురు చెప్పింది. రంజాన్ ప‌విత్ర పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ