hyderabadupdates.com movies వెంకీ లెక్కలు మారుస్తాడా?

వెంకీ లెక్కలు మారుస్తాడా?

తెలుగులో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. ప్రతి సినిమాలో హీరోయిజమే ఉండాలని.. తానే హైలైట్ కావాలని ఆయన ఆలోచించరు. అతి సామాన్యమైన పాత్రలు కూడా చేస్తుంటారు. తన సినిమాల్లో పాత్రకు ఎలివేషన్ తగ్గినా.. పంచులు పడినా ఓకే అంటారు. స్వయంగా తన మీద తానే పంచులు కూడా వేసుకుంటారు. 

ఇలాంటి భేషజం లేని స్టార్లు అరుదుగా ఉంటారు. వెంకీ వేరే సినిమాల్లో ప్రత్యేక పాత్రలు, క్యామియోలు చేయడానికి కూడా వెనుకాడడు. మల్టీస్టారర్లకూ రెడీగా ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేయడమే కాక.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గోపాల గోపాల’లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు వెంకీ. ఆ తర్వాత మరో పవన్ సినిమా ‘అజ్ఞాతవాసి’లో వెంకీ క్యామియో రోల్ చేశాడు.

పవన్‌తో వెంకీ కలిసి నటించిన రెండు సినిమాలూ సంక్రాంతికే రిలీజయ్యాయి. అందులో ‘గోపాల గోపాల’ యావరేజ్‌గా ఆడింది. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరో మెగా హీరో, పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో వెంకీ జట్టు కట్టాడు. ఆ చిత్రమే.. మన శంకర వరప్రసాద్. ఈ చిత్రం కూడా సంక్రాంతికే రిలీజవుతోంది. పవన్‌తో సంక్రాంతికి ఆశించిన ఫలితాలు అందించలేకపోయిన వెంకీ.. ఇప్పుడు అదే పండక్కి చిరు సినిమాలో ప్రత్యేక పాత్రతో ఎలాంటి రిజల్ట్ రాబడతాడా అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. 

అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం ఉంటుంది కాబట్టి ‘అజ్ఞాతవాసి’ లాంటి ఫలితం వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. కానీ ‘గోపాల గోపాల’లా యావరేజ్ రిజల్ట్‌తో కూడా మెగా ఫ్యాన్స్ సంతృప్తి చెందరు. చిరుకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో వెంకీ పాత్ర హైలైట్‌గా ఉంటుందని టీం బలంగా చెబుతోంది. చిరుతో కలిసి ఆయన పండించే వినోదం థియేటర్లను హోరెత్తిస్తుందని అంటున్నారు. మరి వెంకీ ఈ సంక్రాంతికి ‘మెగా’ లెక్కలు మారుస్తాడేమో చూడాలి.

Related Post

`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!

ఎర్ర‌చంద‌నం.. ఏపీలో మాత్ర‌మే.. అది కూడా తిరుప‌తి జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో మాత్ర‌మే ల‌భించే అరుదైన వృక్షాలు. అయితే.. వీటిని అక్ర‌మార్కులు తెగ‌న‌రికి పెద్ద ఎత్తున ర‌వాణా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి అమాయ‌కులైన ఏపీ, తెలంగాణ పౌరుల‌ను, కూలీల‌ను

Aa Nari Ee Nari Song Adds Fun Chaos Ahead of Sharwa’s Sankranthi ReleaseAa Nari Ee Nari Song Adds Fun Chaos Ahead of Sharwa’s Sankranthi Release

Charming Star Sharwa is all set to entertain audiences this festive season with his upcoming family entertainer Nari Nari Naduma Murari, which is gearing up for a grand theatrical release