hyderabadupdates.com Gallery వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌

వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌

వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌ post thumbnail image

తిరుమల : టిటిడి ఈవో ఎం. రవిచంద్ర, మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈవో, అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డన విధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈవో వద్ద భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
తదుపరి అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో, ప్రత్యేకంగా శ్రీ‌వారి సేవకులతో ఈవో మాట్లాడి వారి సేవలను అభినందించారు. తాగునీరు, ఆహార పరీక్షా ప్రయోగశాలను సందర్శించిన ఈవో, వివిధ ప్రమాణాలపై ఆహార పదార్థాల పరీక్షా ప్రక్రియను ఏవిధంగా నిర్వహిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఆక్టోపస్ భవనం నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న బయటి క్యూ లైన్లను పరిశీలించారు. ఈవో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, హెడ్ కౌంట్ తదితర విశ్లేషణ వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న దాత వి. జయప్రకాశ్ తో వర్చువల్‌గా మాట్లాడారు. పీఏసీ-5ను సందర్శించిన ఈవో, లాకర్లు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, స్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి సౌకర్యాలను పరిశీలించి, భక్తుల సౌకర్యార్థం మరింత సమర్థవంతంగా వినియోగించు కునేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
The post వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీPM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీ

    వందేమాతరం గేయం… దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోదీ..

ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కంఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం

న్యూఢిల్లీ : ఏఐ ప్రయోజ‌నాల‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డంలో యుఎస్, భార‌త భాగ‌స్వామ్యం కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్. రెండు దేశాల మధ్య అలంకారికంగా, అక్షరాలా కనెక్షన్ పాయింట్‌గా పని చేయడం పట్ల గూగుల్

Mudumal: ‘ముడుమాల్‌’కు వరల్డ్‌ హెరిటేజ్‌ ట్యాగ్‌!Mudumal: ‘ముడుమాల్‌’కు వరల్డ్‌ హెరిటేజ్‌ ట్యాగ్‌!

    తెలంగాణకు మరో ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా నిపుణులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని దాదాపు మూడున్నర వేల ఏళ్ల నాటి ఆదిమానవుల స్మారక శిలల ప్రాంగణంలో నాటి మానవుల మనుగడకు సంబంధించిన ఆనవాళ్ల కోసం