hyderabadupdates.com movies వేగం పెంచాలోయ్ ‘బైకర్’ సాబ్

వేగం పెంచాలోయ్ ‘బైకర్’ సాబ్

జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం ఏప్రిల్ 3 బైకర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ శర్వా కష్టాన్ని బయట పెడుతున్నాయి తప్ప అసలు కంటెంట్ రివీల్ కావడం లేదు.

ఈ క్రమంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచాల్సిన బాధ్యత బైకర్ బృందం మీద ఉంది. దురంధర్ రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన రెండు వారాల తర్వాత రిలీజ్ కాబట్టి శర్వా టీమ్ టెన్షన్ పడనక్కర్లేదు. చక్కగా ప్రమోషన్లు చేసుకుంటే జనానికి ఇందులో ఏముందో రీచ్ అవుతుంది. స్పోర్ట్స్, అందులో తెలుగు జనాలకు అంతగా సుపరిచితం కాని బైక్ రేసింగ్ కాబట్టి దానికి అనుగుణంగా ప్రేక్షకులను చేరుకోవాలంటే ఏం చేయాలో ముందు దాన్ని ప్లాన్ చేసుకోవాలి.

కేవలం పోస్టర్లతో పనవ్వదు. మరిన్ని వీడియోలు బయటికి రావాలి. శర్వా జిమ్ లో కసరత్తులు చేయడం వగైరాలు ఓకే కానీ మరింత సాలిడ్ విజువల్స్ అసలు సినిమా నుంచి కట్ చేసి చూపించాలి. ముఖ్యంగా ట్రైలర్ ఇక్కడ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. బిజినెస్ పరంగా యువి క్రియేషన్స్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి. కపుల్ ఫ్రెండ్లీ డీసెంట్ సక్సెస్, రాబోయే విశ్వంభర పాన్ ఇండియా రిలీజ్ దృష్టిలో పెట్టుకుని బయ్యర్ల నుంచి కావాల్సినంత సహకారమే ఉంది.

సో బైకర్ కనక సరైన రీతిలో రిజిస్టర్ అయితే ఓపెనింగ్స్, వసూళ్లు రెండూ ఆశించవచ్చు. పోటీ కూడా పెద్దగా లేకపోవడం అడ్వాంటేజ్ అవుతుంది. డాల్బీ విజన్, 3డి లాంటి అత్యాధునిక ఫార్మాట్స్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టే హంగామా చేయాలి. లో ప్రొఫైల్ ఇలాంటి మూవీస్ కి సూట్ అవ్వదు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన బైకర్ కు జిబ్రాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Related Post

ఉత్త‌రాదిలో లోకేష్ హవా.. బాబు స్ట్రాట‌జీ.. !ఉత్త‌రాదిలో లోకేష్ హవా.. బాబు స్ట్రాట‌జీ.. !

రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో టిడిపి పగ్గాలు చేపట్టడం ఖాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలి.. ఎవరితో

యనమల.. రిజర్వా వెయిటింగ్ లిస్టా..!యనమల.. రిజర్వా వెయిటింగ్ లిస్టా..!

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ప్రస్తుతం ఆయన రిజర్వ్‌లో ఉన్నారని కొందరు, కాదు వెయిటింగ్‌లో ఉన్నారంటూ మరికొందరు చెప్పుకుంటున్నారు. నిజానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నా, రాజకీయంగా మాత్రం ఆసక్తికర చర్చగా మారింది. ఇటీవల మంగళగిరి పార్టీ

బొమ్మని ఇంతకన్నా లాగొద్దు బాస్బొమ్మని ఇంతకన్నా లాగొద్దు బాస్

కొత్త సినిమాలను పైరసీ చేస్తూ వందల కోట్ల నష్టాన్ని టాలీవుడ్ కు కలుగజేసిన ఐబొమ్మ ఓనర్ ఇమ్మిడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీని మీద మూవీ లవర్స్ విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేయగా