hyderabadupdates.com movies వైజాగ్ మీద అంత కోపమెందుకు జగన్?

వైజాగ్ మీద అంత కోపమెందుకు జగన్?

ఏపీ మాజీ సీఎం జగన్ కు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఏపీ యువతకు విశాఖలోనే దిగ్గజ కార్పొరేట్ కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు రావడం జగన్ కు నచ్చడం లేదా? తన హయాంలో ఏపీకి రాని కంపెనీలు…చంద్రబాబును చూసి ఏపీకి క్యూ కట్టడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తుంది. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ను అడ్డుకునేందుకు వైసీపీ అండ్ కో ప్రయత్నాలు మొదలుబెట్టింది.

ఈ డేటా సెంటర్ కు కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, వేలాదిమంది యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థను అడ్డుకోవడంలో ప్రజా ప్రయోజనం ఏంటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓ పక్క ప్రపంచ స్థాయి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు, లోకేశ్ బిజీగా ఉంటే…వచ్చిన కంపెనీలను ఎలా అడ్డుకోవాలని వైసీపీ నేతలు ఆలోచించడం శోచనీయం.

ఈ నేపథ్యంలోనే జగన్ పై లోకేశ్ ఫైర్ అయ్యారు. మొదట అమరావతిని వ్యతిరేకించిన జగన్..ఇప్పుడు వైజాగ్ లో అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. అమరావతిలో పవర్ కాంట్రాక్టులు రద్దు చేసిన జగన్…ఐటీ కంపెనీల రాకను అడ్డుకున్నారని లోకేశ్ ఆరోపించారు.

ఇప్పుడేమో దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ అయిన గూగుల్ ఏఐ హబ్ ను అడ్డుకునేందుకు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారని లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ యువత పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల ఎందుకు అంత ద్వేషం జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు. అయితే, జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరని, జగన్ కుట్రలను ఛేదించి రాష్ట్రాభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని స్పష్టం చేశారు.

Related Post

ముందు జాగ్రత్త పడుతున్న మిత్ర మండలిముందు జాగ్రత్త పడుతున్న మిత్ర మండలి

చిన్న సినిమాలకు ప్రమోషన్లు ఎంత చేసుకున్నా సోషల్ మీడియా ద్వారా అది స్ప్రెడ్ కావడం ముఖ్యం. లిటిల్ హార్ట్స్ కి ఇది చాలా ఉపయోగపడింది. మౌళి లాంటి కొత్త కుర్రాడు హీరోగా ఉన్నా సరే ముందు రోజే షోలు వేయడం ద్వారా