hyderabadupdates.com Celeb Gallery వైసీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు!

వైసీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు!

వైసీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు! post thumbnail image

వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు ఆగడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై చంద్రబాబు సర్కార్‌ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.

ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.

కల్తీ మద్యం డెన్‌ను మాజీ మంత్రి జోగి రమేష్ పరిశీలించి .. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ఎక్సైజ్ ఎస్‌ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్‌తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది.

The post వైసీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు! appeared first on Adya News Telugu.

Related Post