hyderabadupdates.com Gallery వ్య‌వ‌సాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బ‌డ్జెట్

వ్య‌వ‌సాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బ‌డ్జెట్

వ్య‌వ‌సాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బ‌డ్జెట్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ అద్భుతంగా ఉంద‌న్నారు. ప్రత్యేకించి వ్య‌వ‌సాయ రంగానికి మ‌రింత ఊతం ఇచ్చేలా ఉండ‌డం ప‌ట్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు స‌భ సాక్షిగా. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా, ఈ రంగంలో 15 శాతం వార్షిక వృద్ధిని సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించిన‌ట్లు తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన” పథకం క్రింద, 2025-26లో రెండవ విడత వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలు చెల్లించామ‌ని చెప్పారు. 2026-27కు గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో ప్రతిపాదించామ‌న్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకున్నామ‌ని తెలిపారు అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వంలో రైతుకు ఉన్న చేదు అనుభవాలను తొలగించి, 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశామన్నారు.
11.02.2026 నాటికి 10,571 కోట్ల రూపాయలను 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అందులో 55 శాతం డబ్బులు 8 గంటలలోపు, 38 శాతం డబ్బులు 8 నుంచి 24 గంటలలో జమ చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని అన్నారు. భూసారాన్ని అంచనా వేయడానికి ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశామ‌న్నారు.1,250 మెట్రిక్ టన్నుల సూక్ష్మపోషకాలను ఉచితంగా సరఫరా చేశామ‌ని తెలిపారు. “పొలం పిలుస్తోంది” కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించిన‌ట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ రైతులకు చెల్లించిన‌ట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50 శాతం రాయితీతో 136.62 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ యంత్రాలను సరఫరా చేస్తున్నామ‌న్నారు. 80 శాతం రాయితీతో 90.4 కోట్ల రూపాయలతో 1,130 కిసాన్ డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. A.P.A.I.M.S.2.O యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దె ప్రాతిపదికన రైతులే స్వయంగా పొందే అవకాశం కల్పించడం జ‌రిగింద‌న్నారు. 2026-27 బడ్జెట్‌లో వ్యవసాయ యాంత్రీకరణకు మొత్తం 139.65 కోట్ల రూపాయలు ప్రతిపాదించామ‌ని తెలిపారు.
The post వ్య‌వ‌సాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బ‌డ్జెట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌

    అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారు.

Delhi: ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదంDelhi: ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం

      దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్ల సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఫర్నీచర్‌ కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బీడీ మార్గ్‌లోని ఈ

శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలిశ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలి

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఒంటిమిట్టలోని టీటీడీ సమావేశ మందిరంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.