hyderabadupdates.com movies ‘వ్యూస్’ కోసం పిల్లలతో అలా చేయించే వీడ్నేం చేయాలి?

‘వ్యూస్’ కోసం పిల్లలతో అలా చేయించే వీడ్నేం చేయాలి?

వ్యూస్ వస్తే డబ్బులొస్తాయి. ఆ పైసల కోసం చేసే పాడు పనులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఒక దుర్మార్గుడు కూడా ఇలాంటి పనులే చేస్తుంటాడు. వాడి మీద తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశాడు. వీడి దారుణ చేష్టల గురించి తెలిస్తే.. ఇలాంటోడి మీద పోక్సో కేసు కూడా తక్కువే అన్న భావన కలుగక మానదు. ఇంతకూ వీడి దారుణాల్లోకి వెళితే..

విశాఖపట్నానికి చెందిన 39 ఏళ్ల సత్యమూర్తికి ఒక పాడు బుద్ధి ఉంది. వైరల్ హబ్ పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే ఇతగాడు.. 2018 నుంచి యూట్యూబ్ చానల్ ను నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యన ఇద్దరు చిన్నారుల్ని ఇంటర్వ్యూ పేరుతో గలీజు ప్రశ్నలు వేయటమే కాదు.. వాటి నుంచి సమాధానాలు రాబట్టి పైశాచిక ఆనందాన్ని పొందాడు. అంతేనా.. అక్కడితో అగని ఈ దుర్మార్గుడు.. చిన్నారులు ముద్దులు పెట్టుకునేలా చేశాడు.

ఆ పాడు వీడియోలను యూట్యూబ్.. ఇన్ స్టాలో పోస్టు చేశాడు. చూసినంతనే చిరాగ్గా.. పిల్లలతో ఈ పాడు పనులేంట్రా అన్న కోపాన్ని కలిగించే ఈ వీడియోలు వైరల్ గా మారాయి. వీటిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. పలువురు ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు అందాయి. దీంతో స్పందించిన హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టి.. అతి జుగుప్సాకరంగా ఉన్న ఈ వీడియోలపై చర్యలు చేపట్టారు.

పోక్సో.. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయటమే కాదు.. తాజాగా అతగాడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ దుర్మార్గ చానల్ అందుబాటులోనే ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి కంటెంట్ చేసే వారిపై చర్యలు కఠినంగా ఉండటమేకాదు.. ఇలాంటి పాడు ఆలోచనలు చేస్తే.. కఠిన శిక్షలు తప్పవన్న సందేశం త్వరగా అందరికి చేరాల్సిన అవసరం ఉంది. అందుకోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Post

Chidambaram Wins Hearts, Team Celebrates Blockbuster Thanks MeetChidambaram Wins Hearts, Team Celebrates Blockbuster Thanks Meet

The Telugu feel-good entertainer Sri Chidambaram has struck a chord with audiences, earning warm word-of-mouth and positive reviews since its theatrical release on February 6. Presented by Chinta Varalakshmi and

అమరావతి రెండో దశ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలో తెలుసాఅమరావతి రెండో దశ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలో తెలుసా

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 33 వేల ఎకరాల భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించారు. ప్రపంచంలో ఇంత