hyderabadupdates.com movies శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు.. స్టేజ్ మీద శంకర్‌తో సినిమా చేయాలన్న తన ఆసక్తిని బయటపెట్టుకున్నాడు. అయినా చిరుతో సినిమా చేయడానికి శంకర్‌కు వీలు పడలేదు. తమిళ అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేస్తూ పోయాడు శంకర్.

కానీ ఇప్పుడు శంకర్‌తో సినిమా చేయాలంటే స్టార్ హీరోలు, నిర్మాతలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఐ, రోబో-2లతో అంచనాలను అందుకోలేకపోయిన ఆయన.. ఇండియన్-2, గేమ్ చేంజర్ చిత్రాలతో డిజాస్టర్లు డెలివర్ చేసి తన డిమాండును బాగా తగ్గిపోయింది. ఇప్పుడు శంకరే హీరోలు, నిర్మాతల వెంటపడాల్సిన పరిస్థితి వచ్చింది.

‘గేమ్ చేంజర్’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఆయన.. ‘వేల్పారి’ అనే బుక్ ఆధారంగా ఒక భారీ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కొందరు నిర్మాతలను సంప్రదించి నిరాశపడ్డ ఆయన.. బాలీవుడ్‌కు చెందిన పెన్ మూవీస్, అలాగే కోలీవుడ్లో ఆర్ టేక్ స్టూడియోస్ అనే మరో సంస్థతో చర్చలు జరుపుతున్నాడు.

మల్టీస్టారర్ అయిన ‘వేల్పారి’లో ముఖ్య పాత్రల కోసం విక్రమ్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్లను శంకర్ సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకో పేరు వచ్చింది. విలక్షణ నటుడు, పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న ధనుష్‌తో ఓ కీలక పాత్ర కోసం ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట శంకర్. ఇటీవల ధనుష్ కొత్త సినిమా ఓపెనింగ్‌కు కూడా శంకర్ రావడంతో ఈ ప్రచారం ఊపందుకుంది.

ధనుష్ ఏళ్ల తరబడి ఒక ప్రాజెక్టుకు అంకితం అయ్యే రకం కాదు. చకచకా సినిమాలు చేసుకుపోతుంటాడు. కానీ శంకర్‌తో సినిమా అంటే చాలా టైం పడుతుంది. ఏళ్లకు ఏళ్లు సాగుతూ ఉంటుంది. మరి ఈ ఇద్దరికీ ఎలా సింక్ కుదురుతుందో చూడాలి. ‘వేల్పారి’లో ధనుష్‌‌కు ఆఫర్ చేస్తున్నది హీరో పాత్ర కాదు కానీ.. చాలా కీలకమైన క్యారెక్టరే అని సమాచారం.

‘వేల్పారి’ ఒక తమిళ యోధుడి కథ. ‘పొన్నియన్ సెల్వన్’ తరహాలోనే ఈ కథకూ పెద్ద హిస్టరీ ఉంది. మరి ఈ కథ అయినా శంకర్‌ కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కిస్తుందేమో చూడాలి.

Related Post

అంచ‌నాల‌కు చేరుతున్న ఆదాయం… సీఎం హ్యాపీ!అంచ‌నాల‌కు చేరుతున్న ఆదాయం… సీఎం హ్యాపీ!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురైన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం అయింద‌ని సీఎం చంద్ర‌బాబు స‌హా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ఆరోపించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేశార‌ని..

అఖండ 2… ఆక్సిజన్ ఇచ్చిన ఆదివారంఅఖండ 2… ఆక్సిజన్ ఇచ్చిన ఆదివారం

మాములుగా ఎంత స్టార్ హీరో అయినా ఫ్లాప్ టాక్ వస్తే నిలదొక్కుపోవడం చాలా కష్టం. కానీ అఖండ తాండవం 2కి ఇది ఇంకోలా జరిగింది. శని ఆదివారం బుకింగ్స్ అనూహ్యంగా పెరిగాయి. రెగ్యులర్ గా బుక్ మై షో ట్రెండింగ్ లో