పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంలో మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ అభినందనలు అందుకుంటోంది. ప్రతి సందర్భంలోనూ వారికి నేను ఉన్నాను అంటూ ఆయన భరోసాను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడును అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు నుంచి పాలకొల్లుకు దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ఇటీవల ఆటోలో వచ్చాడు.
అతనికి ట్రై స్కూటీని ఇస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో వెంకటేశ్వరరావును కలిసి హామీ ఇచ్చిన విధంగా ట్రై స్కూటినీ స్వయంగా మంత్రి లోకేష్ అందజేశారు.
కార్యకర్తలకు అండగా నిలవడం నారా లోకేష్ కు ఇది మొదటిసారి కాదు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన వెంటనే స్పందిస్తున్నారు. ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. ఆ విషయం ఆయన దృష్టికి రాగానే వెంటనే తమ టీం ను అలెర్ట్ చేస్తున్నారు. గతంలో గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్న వారికి ఆయన తనవంతు సాయం చేశారు.
ముఖ్యంగా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు లోకేష్ సాయం కోరగానే వెంటనే స్పందించి వారిని ఆదుకుంటున్నారు. దీంతోపాటు సమయం దొరికినప్పుడల్లా ప్రజా దర్బారు నిర్వహిస్తూ వారి సమస్యలను విని, వాటిని అధికారుల ద్వారా పరిష్కరిస్తున్నారు. ఈ కారణంతో ఆయన ఎక్కడ ప్రజా దర్బార్ నిర్వహించిన వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్నారు. లోకేష్ కి చెబితే సమస్య తీరిపోతుందనే భరోసా కార్యకర్తల్లో కలిగింది.