hyderabadupdates.com movies శర్వా ఇలాంటి ప్రయోగాలే చేయాలి

శర్వా ఇలాంటి ప్రయోగాలే చేయాలి

ఒకే ఒక జీవితం, మనమే తర్వాత శర్వానంద్ నుంచి బాగా గ్యాప్ వచ్చేసింది. అభిమానులు ఎదురు చూసే కొద్దీ కొత్త సినిమా రానేలేదు. ఇప్పుడు వరసగా రెండు రిలీజులు రెడీ అవుతున్నాయి. వాటిలో మొదటిది బైకర్. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 6 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. టీజర్ తో పాటుగా ఈ ప్రకటన రావడంతో ఫ్యాన్స్ హ్యాపీ. అయితే అఖండ 2 వచ్చిన మరుసటి రోజే బైకర్ దించడం రిస్క్ అయినప్పటికీ అంత ధీమా చూపిస్తున్నారంటే కంటెంట్ ఏదో సాలిడ్ గా ఉన్నట్టుంది, కేవలం నిమిషమే ఉన్న వీడియోలో కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు.

ప్రమాదకరమైన బైక్ రేసింగే ప్రాణంగా భావించే ఒక యువకుడు (శర్వానంద్) ఎన్ని కష్టనష్టాలు వచ్చినా అందులోనే ప్రయాణం చేస్తుంటాడు. ఇందులో పాల్గొనే వాళ్ళది ఒక్కొక్కళ్ళది ఒక్కో వ్యథ. అయితే దీని వెనుక కంటికి కనిపించని కథలు కూడా ఉంటాయి. వాళ్ళలో ఇతనికి సంబంధించిన మనిషి (రాజశేఖర్) కూడా ఉంటాడు. ఆ బంధం ఏంటి, బైకర్ గా శర్వా చేసిన సాహసాలు, రిస్కులు ఏంటనేది తెరమీద చూడాలి. విజువల్స్ చాలా స్ట్రయికింగ్ గా ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్ అనేది చాలా పెద్ద మాట అవుతుంది కానీ ఆ స్థాయి క్వాలిటీ చూపించేందుకు పడిన తాపత్రయం కనిపిస్తోంది.

ఇది పక్కన పెడితే శర్వానంద్ చేయాల్సింది ఇకపై కూడా ఇలాంటి ప్రయోగాలే. రెగ్యులర్ కథలు, రొమాన్స్ మాస్ అంటూ అరిగిపోయిన సబ్జెక్టులతో సినిమాలు చేస్తున్న వాళ్లకు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బైకర్ లాంటివి ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన బైకర్ కు జిబ్రాన్ సంగీతం మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. వచ్చే నెలే విడుదల కాబట్టి బైకర్ ప్రమోషన్లు ఊపందుకోబోతున్నాయి. దీని కోసం బాగా సన్నబడి సిక్స్ ప్యాక్ కూడా చేసిన శర్వానంద్ శారీరకంగా తీసుకున్న శ్రమకు తగ్గ ఫలితం రావాలనేదే ఆడియన్స్ కోరిక.

Related Post

Review: The Great Pre-Wedding Show – A simple and watchable comedy dramaReview: The Great Pre-Wedding Show – A simple and watchable comedy drama

Movie Name : The Great Pre-Wedding Show Release Date : Nov 07, 2025 123telugu.com Rating : 3/5 Starring : Thiruveer, Teena Sravya, Master Rohan, and others Director : Rahul Srinivas