hyderabadupdates.com movies శర్వా సహకరించకపోవడమా?

శర్వా సహకరించకపోవడమా?

శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’తో అతను హిట్టు కొడతాడనే నమ్మకాలు కలుగుతున్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్‌గా కనిపించాయి. ఐతే ఈ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పబ్లిసిటీ లేటుగా మొదలుపెట్టారు. తనకు హిట్ చాలా అవసరమైన దశలో శర్వా ప్రమోషన్ పరంగా ఇంకా చురుగ్గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతనెందుకు అంత యాక్టివ్‌గా లేడనే విషయంలో కొంత సందేహాలు కలుగుతున్నాయి. దర్శక నిర్మాతలతో ఏమైనా చెడిందా అనే డౌట్లూ కొడుతున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత అనిల్ సుంకరను అడిగితే.. ఆ అనుమానాలను సింపుల్‌గా కొట్టిపడేశారు. శర్వాతో ఏ ఇబ్బందీ లేదని తేల్చేశారు.

సినిమాకు ప్రమోషన్ పరంగా సహకరించడంలో తాను పని చేసిన హీరోలందరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ శర్వా అని అనిల్ సుంకర తేల్చేశారు. తాను ఇంతకుముందు శర్వాతో ‘మహాసముద్రం’ సినిమా కూడా తీశానని.. అప్పుడు కానీ, ఇప్పుడు కానీ అతను పూర్తిగా సహకరించాడని.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.

శర్వా వేరే చోట ఉండడం వల్ల ప్రెస్ మీట్లో పాల్గొనలేదని.. ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని.. ఈవెంట్లలో పాల్గొంటున్నాడని.. సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతా పడుతున్నాడని అనిల్ స్పష్టం చేశారు. ‘నారీ నారీ నడుమ మురారి’ శర్వా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఫిలింగా నిలుస్తుందని.. తన సంస్థకూ ఘనవిజయాన్ని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5.49 షోలతో విడుదలవుతోంది. ఈ చిత్రంతో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.

Related Post

Sree Vishnu Headlines Youthful Entertainer Directed by Sunny SanjaySree Vishnu Headlines Youthful Entertainer Directed by Sunny Sanjay

Sithara Entertainments has announced its 39th production, featuring King of Entertainment Sree Vishnu in the lead role. Sunny Sanjay, who previously debuted on OTT with Anaganaga, has written and directed

Allu Aravind Says “The Girlfriend” Gave Him Pure Creative SatisfactionAllu Aravind Says “The Girlfriend” Gave Him Pure Creative Satisfaction

“The Girlfriend,” starring National Crush Rashmika Mandanna and Dheekshith Shetty, is all set for a grand release. The emotional love drama, written and directed by Rahul Ravindran, is jointly produced