hyderabadupdates.com Gallery శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది

శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది

శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది post thumbnail image

ముంబై : సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ జ‌ట్టును 7 ప‌రుగుల తేడాతో ఓడించి నేరుగా ఫైన‌ల్ కు చేరుకుంది భారత జ‌ట్టు. ముందుగా మైదానంలోకి దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 253 ర‌న్స్ చేసింది. ఇందులో సంజు శాంస‌న్ 89, కిష‌న్ 38, శివ‌మ్ దూబే 44 , పాండ్యా 26, తిల‌క్ వ‌ర్మ 27 ర‌న్స్ చేయ‌డం ఇంగ్లండ్ జ‌ట్టును చివ‌రి ఓవ‌ర్ దాకా తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు 22 ఏళ్ల కుర్రాడు బెథెల్. త‌ను 48 బంతులు ఎదుర్కొని ఫాస్టెస్ట్ 105 సెంచ‌రీతో దుమ్ము రేపాడు. త‌ను మైదానంలో ఉన్నంత వ‌ర‌కు ఇండియాకు గెలుస్తామ‌న్న ఆశ‌లు లేవు. ఇక బౌలింగ్ ప‌రంగా ఇండియా సూప‌ర్ షో ప్ర‌ద‌ర్శించింది. మ్యాచ్ గెలుపొందిన అనంతరం ముఖ్య భూమిక పోషించిన సంజూ శాంస‌న్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు ద‌క్కింది.
మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ మాట్లాడాడు. ఈ విజ‌యం శాంస‌న్ తో పాటు స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, పాండ్యా, ఇత‌ర ప్లేయ‌ర్ల‌కు ద‌క్కుతుంద‌న్నాడు. వారు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ చేయ‌డం, అక్ష‌ర్ ప‌టేల్ అద్భుత‌మైన క్యాచ్ లు ప‌ట్ట‌డం కూడా ఈ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు చెప్పాడు. ఇక ఫైన‌ల్ మ్యాచ్ కు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామ‌ని అన్నాడు. 143 కోట్ల భార‌తీయుల ఆశీస్సులు త‌మ‌కు ఉండ‌డం వ‌ల్ల‌నే ఈ అద్భుత‌మైన మ్యాచ్ ను గెలుపొంద గ‌లిగామ‌ని పేర్కొన్నాడు సూర్య కుమార్ యాద‌వ్. మ‌రో వైపు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఇంగ్లండ్ కూడా సూప‌ర్ షో చేసింద‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌న్నాడు . మొత్తంగా క‌థ ముగిసింద‌ని, ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ ఉంద‌ని దాని కోసం మేం ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నాడు.
The post శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చ‌రిత్రను తిర‌గ రాసిన టీం ఇండియాచ‌రిత్రను తిర‌గ రాసిన టీం ఇండియా

అహ్మ‌దాబాద్ : స‌మిష్టిగా కృషి చేస్తే ఎంత‌టి ల‌క్ష్యాన్ని అయినా ఛేదించ వ‌చ్చని నిరూపించారు సూర్య కుమార్ యాదవ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఆటగాళ్లు. నిన్న‌టి దాకా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఆటగాళ్లు ఇప్పుడు నీరాజ‌నాలు అందుకుంటున్నారు. సెంటిమెంట్ కు మంగ‌ళం

ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ మూవీ. తాజాగా దీనికి కొన‌సాగింపుగా దురంధ‌ర్ ది రివెంజ్ పేరుతో కొన‌సాగింపుగా

సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నసంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న

గుంటూరు జిల్లా : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో వార్డెన్లు త‌మ ప‌నితీరు మార్చుకోవాల‌ని సూచించారు. కొంద‌రి నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం