hyderabadupdates.com movies శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయిన వెంకట్రామిరెడ్డి

శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయిన వెంకట్రామిరెడ్డి

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా కొనసాగుతున్న ఈ రెడ్డి గారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయనను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సాధారణ పరిపాలనా శాఖ జీవో ఎంఎస్ నెం:43 పేరిట ఉత్తర్వులను జారీ చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడం చాలా అరుదు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సదరు ఉద్యోగం విధివిధానాలను తుంగలో తొక్కుతూ సాగే ఉద్యోగులకు మాత్రం ఈ తరహా గుణపాఠం సరైనదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలో ఉండగా…ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి వెంకట్రామిరెడ్డి అధ్యక్షుడిగా పనిచేశారు. సచివాలయ ఉద్యోగుల ఎన్నికల సమయంలోనే ఆయన అధికార పార్టీ వైసీపీకి చెందిన కార్యకర్తగా వ్యవహరించినట్లుగా ఆయనపై ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ఏకంగా వైసీపీ విధివిధానాలను అనుసరిస్తూ ఒక అసిస్టెంట్ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగి అవలంబించాల్సిన నియమాలకు తిలోదకాలిచ్చారు. వైసీపీ సర్కారు చెప్పినట్టుగా నడుచుకున్న వెంకట్రామిరెడ్డి… ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే… 2024 ఎన్నికల్లో ఆయన ఏకంగా వైసీపీకి ఎన్నికల ప్రచారం చేశారు. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీకి చెందిన ఓ నేత మాదిరిగా వెంకట్రామిరెడ్డి ప్రచారంలో పాలు పంచుకున్నారు. ఈ వ్యవహారంపై నాడే ఎన్నికల సంఘానికి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం విచారణ చేపట్టి ఏపీ ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి వెంకట్రామిరెడ్డిపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణ ముగిసేదాకా  వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది.

ప్రభుత్వ దర్యాప్తులో ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ వాస్తవమేనని తేలింది. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రెడ్డిని శాశ్వతంగా సర్వీసు నుంచి తొలగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం సర్కారీ కొలువులో ఉంటూ రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే వారికి ఓ గుణపాఠం అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

Related Post

అబ్బాయి ఏమో అలా… బాలయ్య ఏమో ఇలా!అబ్బాయి ఏమో అలా… బాలయ్య ఏమో ఇలా!

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం.. ఆదిత్య 369. 90వ దశకం ఆరంభంలో ఎంతో అడ్వాన్స్డ్‌గా ఆలోచించి ఈ సినిమాను అద్భుత రీతిలో తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని బాలయ్య ఎప్పట్నుంచో ఆశపడుతున్నాడు. సింగీతం దర్శకత్వంలోనే

బుచ్చిబాబు దూకుతాడా ఆగుతాడాబుచ్చిబాబు దూకుతాడా ఆగుతాడా

చికిరి చికిరి పాట వచ్చి యాభై రోజులయ్యింది. ఒక్క తెలుగు వెర్షనే వంద మిలియన్ల వ్యూస్ దాటేసి కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ ఇంత గొప్పగా ఉంటుందా అని జెన్ జెడ్ యూత్ ఫీలయ్యే రేంజ్