hyderabadupdates.com movies శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్

శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ పిల్లల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. ఇటీవలే తనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబమంతా తరలివచ్చి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న జంటను ఆశీర్వదించింది. ఈ ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఐతే శిరీష్‌కు నయనిక ఎలా పరిచయం.. ఆమె నేపథ్యం ఏంటి.. వీరి ప్రేమ ఎలా మొదలైంది అని సోషల్ మీడియాలో జనాలు వెతికేస్తున్నారు. వివరంగా కాకపోయినా.. బ్రీఫ్‌గా నయనికతో తమ ప్రేమ గురించి సమాచారం ఇచ్చాడు శిరీష్. ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా అతను ఈ సీక్రెట్ బయటపెట్టేశాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లే.. నయనికతో తన ప్రేమకు పునాది అని శిరీష్ వెల్లడించాడు. వరుణ్, లావణ్యల పెళ్లి తర్వాత యంగ్ హీరో నితిన్, అతడి భార్య షాలిని కలిసి ఒక పార్టీ ఇచ్చారట. 

ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనిక కూడా వచ్చిందట. తొలిసారి తనను అప్పుడే చూశాడట శిరీష్. నాటి పరిచయం తర్వాత తామిద్దరం ప్రేమలో పడ్డామని.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నామని శిరీష్ తెలిపాడు. ఏదో ఒక రోజు తమ పిల్లలు తమ ప్రేమ గురించి అడుగుతారని.. ఆ రోజు ఇదే చెబుతానని శిరీష్ తెలిపాడు. తనను తమ ఫ్రెండ్స్ సర్కిల్ లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ శిరీష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాడు. శిరీష్-నయనికల పెళ్లి ఫిబ్రవరిలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Post

ఆది పినిశెట్టి… ఇలా జరిగిందేంటిఆది పినిశెట్టి… ఇలా జరిగిందేంటి

టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా తన గ్రాఫ్ మారిపోయింది. అల్లు అర్జున్ కు ధీటుగా నిలబడే ప్రతినాయకుడిగా దర్శకుడు బోయపాటి చూపించిన విధానం ఆ బ్లాక్

బన్నీ రికార్డు చిరు సొంతంబన్నీ రికార్డు చిరు సొంతం

ఒకప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరో. సినిమాల బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు, పారితోషకాలు.. ఇలా ఏది చూసుకున్నా చిరు తరచుగా రికార్డులు కొల్లగొట్టేవారు. వేరే స్టార్ల హిట్ సినిమాలకు సమానంగా చిరు ఫ్లాప్ చిత్రాల వసూళ్లు ఉండేవి. ఆయన

KGF co-director Kirtan Nadagouda’s 4-year-old son Chiranjeevi passes awayKGF co-director Kirtan Nadagouda’s 4-year-old son Chiranjeevi passes away

While further details about the project have not yet been revealed, the film stars Surya Raj, Hanu Reddy, and Preethi Pagadala in lead roles. Dinesh Divakaran will serve as the