hyderabadupdates.com Gallery శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం post thumbnail image

అమరావతి : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తమిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాల‌లు ధ‌రించిన భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా. ఇదిలా ఉండ‌గా మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం కోసం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది శ్రీ‌శైలం ఆల‌యం. మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు శ‌నివారం క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీ మ‌ల్లికార్జున స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు వివరించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే విధంగా మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చూడాల‌ని సూచించారు.
The post శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగంప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగం

ఢిల్లీ : ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగం అని ఆ విష‌యం గుర్తించాల‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్. గ్రాడ్యుయేట్లు మూడు ప్రధాన బాధ్యతలను నిలబెట్టు కోవాలని కోరారు. సత్యాన్ని అన్వేషించడంలో మేధోపరమైన నిజాయితీ, అసమానతలను తగ్గించడానికి సామాజిక సమ్మిళితం, జాతీయ

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌

హైద‌రాబాద్ : ఓ వైపు అధికారాన్ని కోల్పోయినా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వాణిని వినిపిస్తూ వ‌స్తున్న భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కు కంట్లో న‌లుసు లాగా త‌యారైంది త‌న స్వంత, ముద్దుల

TTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వంTTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

TTD : దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ (TTD) ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్‌లు, డైరీలను