hyderabadupdates.com movies శివాజీ… టాక్ ఆఫ్ ద టౌన్

శివాజీ… టాక్ ఆఫ్ ద టౌన్

ఈ ఏడాది ‘కోర్ట్’ మూవీతో సినీ రంగంలోకి బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు శివాజీ. అందులో మంగపతి పాత్రలో తన పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక తెలుగు నటుడు నెగెటివ్ రోల్‌లో ఈ మధ్య ఇచ్చిన బెస్ట్ పెర్ఫామెన్స్‌గా దీన్ని చెప్పొచ్చు. ఆ సినిమాతో శివాజీకి అవకాశాలు వరుస కట్టాయి. వాటిలోంచి ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. అందులో ఒకటైన ‘దండోరా’ సినిమా క్రిస్మస్ కానుకగా గురువారం రిలీజైంది.

విడుదలకు ముందే ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేశారు. మంచి స్పందనే వచ్చింది. సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ.. దీన్ని మంచి ప్రయత్నంగానే చెబుతున్నారు. తెలుగులో సామాజిక అంశాల మీద ఇలాంటి హార్డ్ హిట్టింగ్ డ్రామాలు అరుదు అని కితాబిస్తున్నారు. ‘దండోరా’లో పెర్ఫామెన్సుల విషయానికి వస్తే.. అందరూ ముక్తకంఠంతో శివాజీని కొనియాడుతున్నారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో అతను వేసిన ఇంపాక్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

క్రిస్మస్‌కు అరడజను సినిమాలు రిలీజయ్యాయి. ‘ఛాంపియన్’లో రోషన్ బాగా చేశాడు. ‘శంబాల’లో ఆది సాయికుమార్ కూడా ఆకట్టుకున్నాడు. ‘పతంగ్’లో లీడ్ రోల్స్ చేసిన కొత్త నటీనటులు కూడా మెప్పించారు. కానీ మొత్తంగా క్రిస్మస్ సినిమాల్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఎవరిది అంటే శివాజీ పేరే చెప్పాలి.

ఆయన ఇందులో చేసింది హీరో పాత్ర కాదు. ఇందులో నెగెటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి. కానీ తన నటనతోనే కాక.. ఒక కాంట్రవర్శీ వల్ల కూడా శివాజీ ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు.

‘దండోరా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి ఆయన చేసిన కామెంట్లు తీవ్ర దుమారమే రేపాయి. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో శివాజీ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న వాళ్లున్నారు. అదే సమయంలో ఆయన వాడిన పదాలను తప్పుబడుతూ.. చెప్పిన విషయానికి మద్దతుగా నిలుస్తున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తంగా చెప్పాలంటే ఒక వివాదం, ఒక పవర్ఫుల్ పెర్ఫామెన్స్‌తో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడు శివాజీ.

Related Post

సీఎం లంచాలు తీసుకున్నారు విచారించండి: డీజీపీకి ఈడీ లేఖసీఎం లంచాలు తీసుకున్నారు విచారించండి: డీజీపీకి ఈడీ లేఖ

త‌మిళ‌నాడులో మ‌రో నాలుగు నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ను విచారించాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ (ఈడీ) తాజాగా త‌మిళ‌నాడు డీజీపీకి లేఖ రాసింది. ఈ లేఖ‌కు 232 పేజీల నివేదిక‌ను కూడా జ‌త చేసింది. సీఎంతో