hyderabadupdates.com movies శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో రోజు కూడా తెల్లవారుఝాము, అర్ధరాత్రి షోలు వేసే స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. కేవలం పుష్ప 2, యానిమల్ లాంటివి మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కించుకున్నాయి. అసలు విశేషం ఇది కాదు. ఎంత పెద్ద హిట్ అయిన సినిమాకైనా రెండో శుక్రవారం పెద్ద ఎత్తున వసూళ్లు దక్కవు. కానీ దురంధర్ ఆ రికార్డును సైతం బ్రేక్ చేసింది. సెకండ్ ఫ్రైడే 34 కోట్ల 70 లక్షల కలెక్షన్ నమోదు చేసి ఈ రికార్డు అందుకున్న తొలి ఇండియన్ మూవీగా మైలురాయి అందుకుంది.

ఇప్పటిదాకా ఈ ఘనత 27 కోట్ల 50 లక్షలతో పుష్ప టూ పేరు మీద ఉంది. దాన్ని పెద్ద మార్జిన్ తో దాటేయడం చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. రెండో వీకెండ్ పూర్తి కాకుండానే 300 కోట్లను దాటేసిన దురంధర్ నాలుగు వందల కోట్ల క్లబ్బులోకి  అడుగు పెట్టేందుకు పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని దూకుడు మాములుగా లేదు. ఆశ్చర్యకరంగా హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో అఖండ 2 కన్నా వేగంగా దురంధర్ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ ఉదాహరణ చాలు ఎంతగా ఈ మూవీ చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవడానికి. సోషల్ మీడియా మద్దతు ఈ విషయంలో చాలా బలంగా పని చేస్తోంది.

చూస్తుంటే ఫైనల్ రన్ అయ్యేలోపు అయిదు వందల కోట్లు దాటేయడం లాంఛనమే అనిపిస్తోంది. సక్సెస్ వచ్చాక టీమ్ ఫుల్ యాక్టివ్ అయిపోయింది. మాధవన్ అడిగినవాళ్లందరికీ ఇంటర్వ్యూలు ఇస్తుండగా దర్శకుడు ఆదిత్య ధార్ బయటికి వచ్చి విశేషాలు పంచుకుంటూ మెచ్చుకున్నవాళ్లకు థాంక్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 19 విడుదల కాబోయే దురంధర్ 2 రివెంజ్ కోసం ఫ్యాన్స్ అప్పుడే వెయిట్ చేయడం మొదలుపెట్టారు. నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి స్ట్రీమింగ్ జరిగాక దురంధర్ సీక్వెల్ డిమాండ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పట్లో అయితే ఈ స్పీడ్ ఆగేలా లేదు.

Related Post

మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమా ఫీవర్‌ మొదలైంది. ఫస్ట్‌డే–ఫస్ట్‌షో టికెట్ల కోసం మెగా అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అమలాపురంలో జరిగే ప్రీమియర్‌ షో టికెట్‌ వేలంలో అభిమాని వెంకట సుబ్బారావు రూ.1.11 లక్షలకు

Don 3: Shah Rukh Khan to return to the Don franchise with Atlee’s involvement?Don 3: Shah Rukh Khan to return to the Don franchise with Atlee’s involvement?

Don 3 is one of the most awaited films in Bollywood. Initially, Ranveer Singh was roped in to play the protagonist. However, recent reports suggest that Ranveer Singh has exited