hyderabadupdates.com Gallery శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం

శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం

శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం post thumbnail image

తిరుప‌తి జిల్లా : తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. సోమ‌వారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గతంలో నంది వాహనం ఊరేగింపు సమయం లో ఎదురైన అనుభవాలను దృష్టి లో ఉంచుకొని స్వామి వారి వాహనాలను మోసే వారిని ముందుగా గుర్తించి వారికి డ్రెస్ కోడ్ ఇవ్వడం జరింగిందని చెప్పారు. ఈ విషయాన్ని చాలా సార్లు మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియ చేశామ‌న్నారు ఎస్పీ.
కానీ ఈరోజు నంది వాహనం తీసుకొని వస్తున్నప్పుడు కొంత మంది శివ స్వామి మాల దారులు క్రమశిక్షణా రాహిత్యంతో నంది వాహనాన్ని బలవంతంగా తీసుకోనే ప్రయత్నించార‌ని , దీంతో వాహ‌నం ఒక వైపు సొరిగి పోయింద‌న్నారు. భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌నే ఉద్దేశంతో కంట్రోల్ చేసిన‌ట్లు తెలిపారు సుబ్బారాయుడు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క భక్తునికి తక్కువ సమయంలో దర్శనం చేసుకునే లాగా పటిష్ఠ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కానీ కొంత మంది వాస్తవ విషయాలను ధ్రువీకరించు కోకుండా, జరిగిన విషయాన్ని వక్రీకరించి భక్తులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారిపై చట్ట పరమైన చర్య తీసుకోవడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ.
The post శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్‌ – ఉప రాష్ట్రపతిCP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్‌ – ఉప రాష్ట్రపతి

    సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘నవంబర్‌ 22 విశిష్టత గురించి

ఏపీని టూరిజం బ్రాండ్ గా తీర్చిదిద్దుతాంఏపీని టూరిజం బ్రాండ్ గా తీర్చిదిద్దుతాం

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాసనసభ బడ్జెట్ సెషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి మ‌నోహ‌ర్ తో క‌లిసి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో, ఉప ముఖ్యమంత్రి