hyderabadupdates.com movies శ్రీలీల అక్కడ హిట్టు కొట్టినా..

శ్రీలీల అక్కడ హిట్టు కొట్టినా..

త‌మిళంలో స్టార్లు నటించే సినిమాల‌న్నీ తెలుగులో కూడా పెద్ద ఎత్తునే రిలీజ‌వుతుంటాయి. తెలుగు మార్కెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకునే బ‌డ్జెట్, బిజినెస్ లెక్క‌లు వేసుకుంటూ ఉంటారు అక్క‌డి నిర్మాత‌లు. ఐతే మిగ‌తా అన్ని సీజ‌న్ల‌లో త‌మిళ చిత్రాల‌కు తెలుగులో రిలీజ్ ప‌రంగా ఏ ఇబ్బందీ ఉండ‌దు. మంచి రిలీజ్ దొరుకుతుంది. సినిమా బాగుంటే ఓపెనింగ్స్ కూడా వ‌స్తాయి. కొన్ని చిత్రాల‌కు లాంగ్ ర‌న్ కూడా ఉంటుంది. కానీ సంక్రాంతి స‌మ‌యంలో మాత్రం త‌మిళ చిత్రాల‌కు ఇక్క‌డ స్కోప్ ఉండ‌దు. 

తెలుగు సినిమాకు బిగ్గెస్ట్ సీజ‌న్ అయిన సంక్రాంతికి మ‌న చిత్రాల‌కు థియేట‌ర్లు స‌ర్దుబాటు చేయ‌డ‌మే చాలా క‌ష్టం. ఆ టైంలో త‌మిళ సినిమాల‌ను ఇటు ట్రేడ్, అటు ప్రేక్ష‌కులు లైట్ తీసుకుంటారు. ఒక‌ట్రెండు సినిమాలు రిలీజైనా నామ‌మాత్ర‌మే. అందులోనూ 2026 సంక్రాంతికి త‌మిళ సినిమాల ఊసే వినిపించ‌డం క‌ష్టంగా ఉంది. కానీ త‌మిళంలో కూడా సంక్రాంతికి గ‌ట్టి పోటీ నెల‌కొన‌బోతోంది. ఆ చిత్రాల‌ను తెలుగులోనూ రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు కానీ.. ఫ‌లితం ఉండ‌క‌పోవ‌చ్చు.

రాజాసాబ్, మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్, అన‌గ‌న‌గా ఒక రాజు సంక్రాంతికి రావ‌డం ప‌క్కా. ఇంకా భ‌ర్త‌మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి, నారి నారి న‌డుమ మురారి కూడా రేసులో ఉన్నాయి. వాటి విష‌యంలో కొంత సందిగ్ధ‌త నెల‌కొంది. వీటికే థియేట‌ర్ల స‌ర్దుబాటు క‌ష్టం. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మిళ సినిమాల‌కు ఏం స్క్రీన్లు, షోలు ఇస్తారు. జ‌న‌వ‌రి 9న రాజాసాబ్‌తో పాటు రిలీజ్ కానున్న విజ‌య్ మూవీ జ‌న‌నాయ‌కుడుకు చెప్పుకోద‌గ్గ రిలీజ్ ఉండొచ్చు. అది కూడా మూడు రోజులే థియేట‌ర్ల‌లో ఉంటుంది. 12న మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ వ‌చ్చాక దాన్నీ ప‌క్క‌న పెట్టేస్తారు. ఆ త‌ర్వాత పోటీ తీవ్ర‌మ‌వుతుంది. 

కాబ‌ట్టి త‌మిళంలో సంక్రాంతికి షెడ్యూల్ అయిన‌ శివ‌కార్తికేయ‌న్-శ్రీలీల మూవీ ‘ప‌రాశ‌క్తి’కి తెలుగులో అస్స‌లు స్కోప్ ఉండ‌క‌పోవ‌చ్చు. శ్రీలీల తెలుగులో వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందిప‌డుతోంది. ఆమెకు ప‌రాశ‌క్తి బ్రేక్ ఇస్తుంద‌నే ఆశ‌లు క‌లుగుతున్నాయి. గురు, ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాలు తీసిన సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉణ్నాయి. కానీ ‘ప‌రాశ‌క్తి’ త‌మిళంలో హిట్ట‌యినా.. తెలుగులో ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎందుకంటే సంక్రాంతి తెలుగు సినిమాల మధ్య దీనికి థియేటర్లు దొరకవు. లేటుగా రిలీజ్ చేస్తే బజ్ రాదు. ఓ మంచి హిట్ అవ‌స‌ర‌మైన స్థితిలో ప్రామిసింగ్ సినిమాతో రాబోతున్న‌ప్ప‌టికీ.. పరాశక్తి సంక్రాంతి టైంలో రిలీజ్ కావ‌డం శ్రీలీలకు మైన‌స్ అయ్యేలా ఉంది.

Related Post

Karmanye Vadhikaraste Streaming Now on Sun NXT After Theatrical SuccessKarmanye Vadhikaraste Streaming Now on Sun NXT After Theatrical Success

The Telugu film Karmanye Vadhikaraste, produced by Ushaswini Films and presented by Javvaji Surendra Kumar, is now officially streaming on the Sun NXT OTT platform after enjoying success in theaters.

భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్‌లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన