hyderabadupdates.com Gallery శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం post thumbnail image

తిరుమ‌ల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందుగా ఆయన క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈవోకు అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓలు వీర‌బ్రహ్మం, శ‌ర‌త్ లు ఘ‌నంగా స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా బాధ్యతలు స్వీక‌రించిన అనంతరం ముద్దాడ ర‌విచంద్ర‌కు పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ బోర్డు, భక్తుల సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో భక్తులకు చక్కని సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అటు తరువాత ఆయన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌న స‌ర్వీస్ లో అత్యంత నిజాయితీ ప‌రుడైన అధికారిగా గుర్తింపు పొందిన అనిల్ కుమార్ సింఘాల్ ను ఉన్న‌ట్టుండి ఈవో ప‌ద‌వి నుంచి తొల‌గించింది. ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే రిపోర్ట్ చేయాల‌ని సీఎం ఆదేశించారు. ఇది భ‌క్తుల‌ను విస్తు పోయేలా చేసింది.
The post శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: చొరబాటుదారుల కారిడార్ నిర్మించడమే ప్రతిపక్షాల లక్ష్యం – అమిత్‌షాAmit Shah: చొరబాటుదారుల కారిడార్ నిర్మించడమే ప్రతిపక్షాల లక్ష్యం – అమిత్‌షా

    బిహార్‌లో ప్రధాని మోదీ పారిశ్రామిక నడవా నిర్మించాలని అనుకుంటుంటే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మాత్రం చొరబాటుదారుల కారిడార్‌ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాసారాం, అర్వల్‌ పట్టణాల్లో

Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్

    అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అతని కజిన్, అస్సాం పోలీస్ సర్వీస్‌ (APS) అధికారి సందీపన్‌ గార్గ్‌ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా