hyderabadupdates.com Gallery శ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి : ఈవో

శ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి : ఈవో

శ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి  : ఈవో post thumbnail image

తిరుమ‌ల : తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కోరారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించిన ఈవో సేవకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం సేవకులతో సమావేశమై అన్న ప్రసాదం, పరిశుభ్రత, క్యూలైన్ నిర్వహణ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నిత్యం తిరుమ‌ల‌కు వ‌చ్చేసే భక్తులకు ప్రత్యక్షంగా సేవలందించే సేవకులు వారి సమస్యలను బాగా అర్థం చేసుకోగలరని అన్నారు. అందువల్ల వారు అందించే సూచనలు ఎంతో విలువైనవని ఈవో పేర్కొన్నారు.
సేవ‌కులు అందించే ఫీడ్‌బ్యాక్ భక్తుల సౌకర్యాల అభివృద్ధికి, వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కీలకంగా ఉపయోగ పడుతుందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. అంత‌కు ముందు ఈవో సేవా సదన్-2లోని రిసెప్షన్, వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ కౌంటర్లను సందర్శించి, సేవకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అలాగే హాల్స్‌ను తనిఖీ చేశారు. అనంత‌రం కొంతమంది సేవకులతో మాట్లాడ‌గా వారికి అందుతున్న సౌకర్యాలపై సేవకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌వి, శ్రీవారి సేవా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
అంత‌కు ముందు కార్య నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర ఆల‌యాన్ని, ప‌రిస‌ర ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త పాటించాల‌ని సూచించారు. భ‌క్తులు సైతం టీటీడీ సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. స్వామి వారి ద‌ర్శ‌నం అయ్యేంత వ‌ర‌కు సంయ‌మ‌నం పాటించాల‌ని హిత‌వు ప‌లికారు.
The post శ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి : ఈవో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌

DGP Shivadhar Reddy : మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్‌ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బండి ప్రకాశ్‌

ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరుఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు

హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్ కు బెయిల్ ల‌భించింది. నిన్న ఆయ‌న‌ను ఈగెల్ టీం ఆధ్వ‌ర్యంలో ప‌ట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా

ReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలుReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు

  గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో