hyderabadupdates.com movies శ్రీవిష్ణు సంకటం ఎవరికీ వద్దు

శ్రీవిష్ణు సంకటం ఎవరికీ వద్దు

ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన విషయం. గతంలో బాలకృష్ణ, నాని ఇది అనుభవించారు కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు వచ్చేశాయి. వాళ్ళిద్దరి హయాంలో ఓటిటిలు లేవు. న్యాచురల్ స్టార్ టైంలో ఇంటర్ నెట్ ఉంది కానీ 5జి ఇంకా పరిచయం కానీ రోజులువి.

కానీ ఇప్పుడలా లేదు. ఆడియన్స్ మరీ అడ్వాన్స్ అయిపోయారు. నిర్ణయాలు చాలా హార్ష్ గా తీసుకుంటున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా సరే వెంటనే థియేటర్లకు పరిగెత్తడం లేదు. ట్రెండ్ కు తగ్గట్టు తాము కోరుకుంటున్నవి లేకపోతే ప్రేమకథలను కూడా పట్టించుకోవడం లేదు.

అలాంటిది శ్రీవిష్ణు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో వరసగా మృత్యుంజయ్, విష్ణు విన్యాసంతో వస్తున్నాడు. ఓటిటితో ముందే చేసుకున్న అగ్రిమెంట్లు ఇతరత్రా కారణాలతో ఏ నిర్మాత వెనుకడుగు వేయలేని సీన్ ఉండటంతో వేరే ఆప్షన్ లేకుండా విడుదలకు రెడీ చేయడం చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పుడు దేనికి ఎక్కువ ప్రమోషన్ జరుగుతుందనేది కీలకం. మనిషికి రెండు కళ్ళు ముఖ్యమన్నట్టు ఫలానా దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మరొకటి లైట్ తీసుకోవడానికి లేదు. గత డిసెంబర్ లో సైక్ సిద్దార్థ, వనవీర రిలీజప్పుడు నందు లాంటి సపోర్టింగ్ ఆర్టిస్ట్ కం హీరోనే ఈ విషయంలో చిన్నపాటి వివాదాన్ని చవి చూడాల్సి వచ్చింది.

మరి ఇంత గుర్తింపు ఉన్న శ్రీవిష్ణుకి ఈ చిక్కు తలెత్తితే ఎంతైనా సమస్యేగా. కాకపోతే రెండు సంబంధం లేని డిఫరెంట్ జానర్లు కావడం ఊరట కలిగించే విషయం. అసలే ఫిబ్రవరి చాలా డ్రైగా ఉంది. థియేటర్లకు పబ్లిక్ పెద్దగా రావడం లేదు. మల్టీప్లెక్సుల్లో సగం షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి నెలకొంది. సంక్రాంతి హడావిడి అయిపోయాక నిశ్శబ్దం తాండవిస్తోంది.

కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కొంత నెట్టుకొస్తున్నాయి కానీ అది సరిపోవడం లేదు. సో బాక్సాఫీస్ కు ఊపు తెచ్చే బాధ్యత శ్రీవిష్ణు మీద ఉంది. ఒక సినిమా అయితే ఫుల్ ఫోకస్ పెట్టేవాడు కానీ ఇప్పుడు బాధ్యతనుం సమంగా పంచి ఆయా నిర్మాతలకు న్యాయం చేయాల్సి ఉంటుంది.

Related Post

థియేటర్లో జనాలున్నా ట్విస్ట్ వేరే ఉందిథియేటర్లో జనాలున్నా ట్విస్ట్ వేరే ఉంది

ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా దాదాపుగా అన్ని చోట్లా సెలవు వాతావరణం ఉండటంతో జనం థియేటర్లకు బాగానే వెళ్లారు. ఈ రోజు ఏకంగా ఆరేడు రిలీజులు ఉన్నాయి కాబట్టి వాటిని హౌస్ ఫుల్ చేశారేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తాజాగా వచ్చిన

All About Zendaya’s 2026 Projects: The Drama, Euphoria Season 3, The Odyssey, Spider-Man: Brand New Day, and Dune: Part ThreeAll About Zendaya’s 2026 Projects: The Drama, Euphoria Season 3, The Odyssey, Spider-Man: Brand New Day, and Dune: Part Three

Cast: Timothée Chalamet, Zendaya, Jason Momoa, Florence Pugh, Rebecca Ferguson, Isaach de Bankolé, Charlotte Rampling, Anya Taylor-Joy, Robert Pattinson, Javier Bardem Director: Denis Villeneuve Language: English Genre: Epic Space Opera