hyderabadupdates.com Gallery శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు post thumbnail image

నంద్యాల జిల్లా : మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు శ్రీ‌శైలం క్షేత్రానికి రానున్నార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు చేశామ‌న్నారు. శివరాత్రి రోజు సుమారు 1,50,000 పైన భక్తులు వస్తారని అంచ‌నా వేశామ‌న్నారు. భక్తులకు సౌకర్యాలతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఇలాంటి సౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేయడంతో పాటు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ . 11 తేదీ బుధవారం సుమారు 63,596 మంది భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. .వీరిలో 14,803 మంది శివ భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్పర్శ దర్శనం చేశార‌ని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 30,149 మంది దర్శనం చేసుకోగా వారిలో 11,515 మంది శివ భక్తులు ఉన్నారని తెలిపారు ఎస్పీ.
నిన్నటి దినం కైలాస ద్వారం నుండి సుమారుగా 26,000 మందికి పైగా భక్తులు కాలినడకన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించు కోవడానికి రావడం జరిగిందని వారికి అసౌకర్యం లేకుండా వైద్య సేవలతో పాటు ఆహారం, నీళ్లు మొదలగు సౌకర్యాలు కల్పించామ‌న్నారు. శివరాత్రి పర్వదినం రోజున అనగా 15 వ తేదీన సుమారు 1,50,000 మంది కన్నా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు శాంతి భద్రతలకు భంగం కలగకుండా సరిపడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామ‌న్నారు. స్నాన ఘట్టాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు బోట్లను , గజ ఈతగాలను కూడా ఏర్పాటు చశామ‌న్నారు..
The post శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీMadhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను బీజేపీ (BJP) ఎంపీ గణేష్ సింగ్ (MP Ganesh Singh) అందరూ

Kinjarapu Rammohan Naidu: నవంబర్‌ 15 నుంచి విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసుKinjarapu Rammohan Naidu: నవంబర్‌ 15 నుంచి విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసు

Kinjarapu Rammohan Naidu : విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు (Kinjarapu Rammohan Naidu) తెలిపారు. విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని