hyderabadupdates.com Gallery శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు post thumbnail image

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుప‌తి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు 7వ తేదీ శ‌నివారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఆలయంలో 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహ వాచనం, మృత్సం గ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్ప‌ణ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తారు.శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు ఫిబ్ర‌వ‌రి 8న ఉద‌యం 8.15 నుండి 8.35 గంట‌ల మ‌ధ్య కుంభ ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది. అంత‌కు ముందు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ జ‌రుగ‌నుంది.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. శ్రీనివాస మంగాపురం పరిసర గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. వాహన సేవల సమయంలో భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు, వైద్య, పార్కింగ్, క్యూలైన్లు, భద్రత తదితర సేవలను అందించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి దాదాపు 10 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీ జాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహన సేవల్లో స్వామి, అమ్మ వార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతా మూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.
The post శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kerala Government Honours Mohanlal for Dadasaheb Phalke AwardKerala Government Honours Mohanlal for Dadasaheb Phalke Award

Veteran actor Mohanlal was felicitated by the Kerala government in a grand ceremony held at the Central Stadium in Thiruvananthapuram, following his recent recognition with the prestigious Dadasaheb Phalke Award.

బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు , తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. సోయి త‌ప్పిన మాట‌లు, సొల్లు క‌బుర్లు చెబుతూ తెలంగాణ‌పై నిత్యం విషం చిమ్మే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని

సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్

కేర‌ళ : త‌మ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై స్పందించారు తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్. ఆదివారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. తాజాగా స్వ‌దేశంలో న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రిగిన టి20