hyderabadupdates.com movies శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే తన ట్యాగ్ అతిశయోక్తిలా ఏమీ అనిపించదు. నిజంగానే తన సినిమాలు భలే వినోదాన్ని పంచుతున్నాయి.

గత ఏడాది ‘సింగిల్’ పెద్ద హిట్టయింది. ఈ వారం రాబోతున్న ‘విష్ణు విన్యాసం’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే తాను హీరోగా నటించిన సినిమాల కంటే.. చిన్న క్యారెక్టర్ రోల్ చేసిన సినిమా తనకు ఒక రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చిందంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించాడు శ్రీ విష్ణు. ఆ చిత్రమే.. సన్నాఫ్ సత్యమూర్తి. 

ఇందులో శ్రీ విష్ణు.. అల్లు అర్జున్ ఫ్రెండు పాత్ర చేశాడు. టాలీవుడ్లో బాగా పేరుమోసిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘శ్రేయాస్ మీడియా’ను ఈ సినిమాలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థగా చూపించారు. దాని అధినేత పాత్రలో శ్రీ విష్ణు భలే వినోదాన్ని పంచాడు.

తన మీద తక్కువ సీన్లే ఉంటాయి కానీ.. అవి ఫన్నీగా ఉంటాయి. బన్నీకి సాయం చేసినట్లే చేసి.. తనకు కాలేజీ రోజుల్లో అతను చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కనిపిస్తాడు శ్రీ విష్ణు. అప్పటికే హీరోగా చిన్న సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో చిన్న క్యారెక్టర్ రోల్ చేయడం ఆశ్చర్యమే. 

ఈ చిన్న పాత్రే తనకు కేరళలో ఊహించని గుర్తింపు తెచ్చిపెట్టిందని శ్రీ విష్ణు తెలిపాడు. తాను కేరళకు వెళ్తే చాలామంది గుర్తుపట్టి పలకరించడం చూశానని.. తాను అంత పాపులర్ ఎలా అయ్యానో తనకు ముందు అర్థం కాలేదని శ్రీ విష్ణు తెలిపాడు.

తర్వాత వాళ్లు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా గురించి ప్రస్తావించడంతో షాకయ్యానని అతను చెప్పాడు. చేసింది చిన్న పాత్రే అయినా పరాయి రాష్ట్రంలో తనకు అంత గుర్తింపు తెచ్చిపెట్టడం ఆశ్చర్యమని.. ఇది తన కెరీర్లో ఒక మరుపురాని అనుభవమని.. అందుకే తనకు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మెమొరబుల్ మూవీ అని శ్రీ విష్ణు తెలిపాడు.

Related Post

ZEE5 Drops Gripping Trailer of ‘Nayanam’, a Bold Telugu Sci-Fi Psychological ThrillerZEE5 Drops Gripping Trailer of ‘Nayanam’, a Bold Telugu Sci-Fi Psychological Thriller

ZEE5 has released the much-awaited trailer of Nayanam, a high-concept Telugu original that blends psychological drama with a sharp sci-fi twist. Starring Varun Sandesh and Priyanka Jain, the series begins

రవితేజ బయోపిక్ చేయాలనుకుని..రవితేజ బయోపిక్ చేయాలనుకుని..

‘మహానటి’ సినిమా అద్భుత విజయాన్నందుకున్నాక తెలుగులో ఉన్న లెజెండరీ నటీనటులందరి అభిమానులకూ తమ అభిమాన తారల బయోపిక్స్ తెరపై చూసుకోవాలని అనిపించే ఉంటుంది. నందమూరి తారక రామారావు జీవిత కథను తెరపైకి తీసుకొచ్చారు కానీ.. దానికి సరైన టైమింగ్ కుదరకపోవడం వల్లో,